
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాల సందడి మొదలైయ్యింది. సంభవం ఆధ్యాయం ఒన్ను, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. ఇక గురువారం (ఏప్రిల్ 16) అర్ధరాత్రి నుంచి మరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక తమిళ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణ్ వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ది రివేంజ్ ను తట్టుకుని మరీ భారీ కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. అందుకే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి భారీ వసూళ్ల వచ్చాయి. ఐఎమ్‌డీబీలోనూ ఈ యూత్ పుల్ లవ్ స్టోరీకి 7.2 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక అమ్మాయినైనా ప్రేమించాలనుకునే కుర్రాడి లైఫ్ లోకి ముగ్గురు అమ్మాయిలు వస్తే ఏం జరిగిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రవీణ్ అనే టీనేజర్ స్కూల్ లైఫ్ కంప్లీట్ అయ్యేలోపు ఒక్కరినైనా ప్రేమించాలని టార్గెట్ గా పెట్టుకుంటాడు. కానీ అతని జీవితంలోకి గంగవల్లి (అనీషా), ప్రేషిక (మీనాక్షి), సోనాల్ (ప్రియాన్షి) వస్తారు. అయితే ప్రవీణ్ కు ప్రేషిక, సోనాల్ బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత గంగవల్లితో లవ్ ట్రాక్ నడుపుతాడు.
మరి ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరకు ఏమైంది? అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించిన ఈ సినిమా పేరు యూత్. 27 ఏళ్ల కెన్ కరుణాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించాడు. అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరమూడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ చూడాలనుకునేవారికి యూత్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
Ennadhu Praveen ku innoru crush ah? 🤭❤️ pic.twitter.com/BAEBH8RQR7
— Netflix India South (@Netflix_INSouth) April 16, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.