
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. అయితే గత వారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. భారీ వ్యూయర్ షిప్ సాధిస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సాధారణంగా ఓ క్రైమ్ సిరీస్ లో ఉండే సస్పెన్స్, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్సే ఇందులో ఉన్నాయి. అయితే స్క్రీన్ ప్లే మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్ అవుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక స్టోరీ విషయానికి వస్తే.. ప్రముఖ రచయిత అభీక్ బారువా రాసిన ‘సిటీ ఆఫ్ డెత్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కోల్‌కతా నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. నగరంలో ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తుంటాడు. ఇందులో సామాన్యులతో పాటు ప్రముఖ వ్యాపారుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలు ఉంటారు. సైకో కిల్లర్ గురించి చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారుతుంది.
మరోవైపు ఒకప్పుడు ఇంటెలిజెంట్ అండ్ టాప్ పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న రీటా బ్రౌన్ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలతో విధులకు దూరంగా ఉంటుంది. అయితే ఈ సైకో కిల్లర్ ఆగడాలు పెరిగిపోవడంతో రీటా మళ్లీ డ్యూటీలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో తన బృందంతో కలిసి ఈ సీరియల్ కిల్లింగ్స్ గురించి దర్యాప్తు ప్రారంభిస్తుంది రీటా. ఈ క్రమంలోనే ఆమెకు సంచలన విషయాలు తెలుస్తాయి. మరి నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఆ సిరీయల్ కిల్లర్ ఎవరు? అతని నేపథ్యమేంటి? చివరకు పోలీసులకు ఎలా దొరికాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ నటించిన ఈ వెబ్ సిరీస్ పేరు బ్రౌన్. అభినయ్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌ను జీ స్టూడియోస్ నిర్మించింది. బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జరిగిన ‘బెర్లినాల్ సిరీస్ మార్కెట్ సెలెక్ట్స్ 2023’ కు ఎంపికైన ఏకైక భారతీయ వెబ్ సిరీస్‌గా బ్రౌన్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో సిరీస్ ను ఎంజాయ్ చేయవచ్చు.
A ritual murder.
A city drowning in secrets.
A cop haunted by her own demons.She may be broken but she’s all that stands between Kolkata and its darkest secret.#Brown premieres 5th June on #ZEE5#BrownOnZEE5 #ZEE5India@KarismaKapoor @Jisshusengupta @Ajinkyad @Soni_Razdan… pic.twitter.com/nBbs1ObqSJ
— ZEE5Official (@ZEE5India) May 30, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి