‘టైటానిక్’ లాంటి విజువల్ వండర్ తో అందరి దృష్టిని ఆకర్షించారు హాలీవుడ్ సంచలన దర్శకుడు జేమ్స్ కామెరూన్. దీని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ అవతార్ అనే సినిమాను తెరకెక్కించాడు కామెరూన్. 2009లో రిలీజైన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.14-15 వేల కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక దీనికి కొనసాగింపుగా 2022లో రిలీజైన అవతార్ పార్ట్ 2 ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ కూడా సంచలన విజయం సాధించింది. ఏకంగా రూ.18 వేల కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. అయితే గతేడాది డిసెంబరులో రిలీజైన మూడో పార్ట్ అవతార్: ఫైర్ అండ్ యష్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. 14 వేల కోట్ల కలెక్షన్లు వచ్చినప్పటికీ మొదటి, రెండు పార్టులతో పోలిస్తే కంటెంట్ పరంగా విమర్శలు అందుకుంది. కాగా అవతార్ పార్ట్ 3 ఒరిజినల్ ఇంగ్లిష్ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే కేవలం రెంట్ విధానంలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 24 నుంచి డిస్నీ+ (Disney+) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మన దేశంలో ఈ మూవీ ‘జియోహాట్‌స్టార్ లో అందుబాటులోకి రాబోతోంది.
లైట్‌స్ట్రోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ కామెరాన్, జాన్ లాండౌలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సామ్ వార్తింగ్టన్, జో సాల్దానా, సిగౌర్నీ వేవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టీస్, జోయెల్ డేవిడ్ మూరే, బ్రెండన్ కోవెల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి జేమ్స్ కామెరాన్, రిక్ జాఫా, అమందా సిల్వర్‌లు స్క్రీన్ ప్లే, స్టోరీని అందించారు.
ఇక స్టోరీ విషయానికి వస్తే.. అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ముగిసిన చోట నుంచే ఈ మూడవ భాగం కథ మొదలవుతుంది. తన కుమారుడు నెటెయమ్ మరణం తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి జేక్ సల్లీ, నెయితిరి ప్రయత్నిస్తుంటారు. మరోవైపు విలన్ కల్నల్ మైల్స్ క్వారిచ్ పండోరా గ్రహంపై ఉన్న ‘మ్యాంగ్‌క్వాన్’ తెగ తో చేతులు కలుపుతాడు. జేక్ సల్లీ కుటుంబాన్ని వేటాడటమే లక్ష్యంగా క్వారిచ్ పోరాటం సాగిస్తాడు. ఈసారి కల్నల్‌కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.
‘AVATAR: FIRE & ASH’ has won Best Visual Effects at the BAFTAs.
See the full winners list: https://t.co/IcZlNB6Mtm pic.twitter.com/STBUZu6jBS
— DiscussingFilm (@DiscussingFilm) February 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.