18 Pages: ఇట్స్ అఫీషియల్.! ’18 పేజెస్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

|

Jan 20, 2023 | 1:24 PM

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రం ’18 పేజెస్’.

18 Pages: ఇట్స్ అఫీషియల్.! 18 పేజెస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
18 Pages
Follow us on

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రం ’18 పేజెస్’. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మంచి సక్సెస్ అందుకున్నా.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఫర్వాలేదనిపించింది. ఇక ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ’18 పేజెస్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ ఖరారైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ సినిమాను జనవరి 27 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. అటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ చిత్రం విడుదల కానుండగా.. అదే తేదీన స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. అలాగే దర్శకుడు సుకుమార్ కథను అందించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ మూవీకి సంగీతం అందించాడు.