OTT Movie: గుండె ధైర్యముంటేనే చూడండి.. ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీలో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ మూవీ ఒక మంచి ఛాయిస్. ఇటీవలే థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ ను బాగా భయపెట్టిన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: గుండె ధైర్యముంటేనే చూడండి.. ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie

Updated on: May 19, 2026 | 1:36 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీలీలావతి, కమెడియన్ సత్య జైట్లీ, మేము కాపులం అనే వెబ్ సిరీస్‌, సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్‌, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అయితే వీటన్నిటి కంటే ముందే ఓ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ సినిమాల్లో మమ్మీ కూడా ఒకటి. ఇప్పటివరకు ఈ సిరీస్ లో చాలా సినిమాలు రాగా అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇండియాలోనూ అందులో తెలుగులోనూ మమ్మీ సినిమాలకు చాలా మంది ఆదరణ దక్కింది. కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీలో వచ్చిన మరో చిత్రం ‘ద మమ్మీ 2026’. గత నెలలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెడుతూనే భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ద మమ్మీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ద మమ్మీ సినిమా కేవలం ఓవర్సీస్ ఆడియెన్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రావొచ్చు. ఇక ‘ద మమ్మీ’ విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం ఆనందిస్తుంది. కానీ అంతలోనే ఆమెలో ఉన్న రాక్షస శక్తులు బయపడతాయి. ఆ కుటుంబాన్ని బాగా ఇబ్బంది పెడతాయి.మరి ఆ తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్ భయపెట్టేలా ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒ రేంజ్ లో ఉందని కామెంట్స్ వినిపించాయి. మరి ఓటీటీలో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ద మమ్మీ ఫర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ద మమ్మీ 2026 స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us