Pakka Commercial: ఆహాలో సందడి చేయనున్న పక్కా కమర్షియల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

చాలా కాలం తర్వాత మ్యాచో హీరో గోపిచంద్ నటించిన సినిమా పక్కా కమర్షియల్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రాశీ ఖన్నా కథానాయికగా నటించింది.

Pakka Commercial: ఆహాలో సందడి చేయనున్న పక్కా కమర్షియల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Pakka Commercial

Updated on: Aug 01, 2022 | 12:47 PM

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా (Aha). కేవలం తెలుగు చిత్రాలే కాకుండా ఇతర భాషల బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను డబ్ చేస్తూ ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని అందిస్తుంది. అంతేకాకుండా సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, గేమ్ షోస్, రియాల్టీ షోలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటూ డిజిటల్ ప్లాట్‏ఫాంలో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో హిట్ చిత్రాన్ని సినీ ప్రియులకు అందిస్తుంది. మ్యాచో స్టార్ గోపిచంద్, రాశీఖన్నా కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్ (Pakka Commercial) ఆహాలో రాబోతుంది.

చాలా కాలం తర్వాత మ్యాచో హీరో గోపిచంద్ నటించిన సినిమా పక్కా కమర్షియల్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. జూలై 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఆగస్ట్ 5 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యాక్షన్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈసినిమాలో సత్యరాజ్, రావు రమేష్, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. థియేటర్లలో ఈ సినిమా చూడని వారు ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూసేయ్యోచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.