
ఈ మధ్యకాలంలో ఓటీటీల హడావిడి ఎక్కువైంది. థియేటర్స్ సంగతి పక్కన పెడితే ఓటీటీలో మాత్రం సినిమాలు తెగ రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం కోసం ఓటీటీ లవర్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు, హిందీ, తమిళ్, మలయాళ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా మన భాషలో డబ్ అయ్యి ఓటీటీల్లో అందుబాటులో ఉంటున్నాయి. దాంతో ఆడియన్స్ ఇంట్లో కూర్చొని సినిమాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓటీటీలో థ్రిల్లర్, రొమాంటిక్, హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడు తగ్గదు. ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది.
ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది.. తెలుగులోనూ అందుబాటులో ఉంది ఈ సినిమా.. ఈ సినిమాను ఏకంగా ఆరు ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ఈమూవీలో ప్రతి సీన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఊహించని ట్విస్ట్ లు , ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. 7.4 రేటింగ్‌తో ఓటీటీలో దుమ్మురేపుతోంది ఈ సినిమా..ఇంతకు ఈ సినిమా ఎదో తెలుసా.? తమిళ్ లో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న కాళిదాస్ 2, గతంలో వచ్చిన కాళిదాస్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. కానీ ఈ సినిమాకు ఆ సినిమాకు పొంతన ఉండదు. కాబట్టి మొదటి పార్ట్ చూడకపోయినా పర్లేదు.. కానీ ఈ సినిమా మాత్రం మిస్ అవ్వకండి.
ఈ సినిమాలో ఓగేటెడ్ కమ్యూనిటీలో న్యూఇయర్ పార్టీ జరుగుతుంటుంది. అక్కడ ఓ చిన్న పాప మిస్ అవుతుంది. ఆ కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి కాళిదాస్ వస్తాడు. అయితే ఆ తర్వాత ఆ చిన్నపాప శవం దొరుకుతుంది. ఆతర్వాత వరుసగా మరణాలు జరుగుతుంటాయి. అదేసమయంలో ఆ కమ్యూనిటీ సెక్రటరీ ఏదో నిజం దాస్తున్నాడని అర్థం అవుతుంది. దాంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆతర్వాత ఏం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ప్రస్తుతం ఆరు ఓటీటీల్లో రిలీజ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే, టెంట్ కొట్ట, ఆహా తమిళ, సన్ NXT, షార్ట్ ఫిక్స్ ఇండియా ఓటీటీల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి.