
DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా వచ్చిన సినిమా ‘డీజె టిల్లు’. ఫిబ్రవరి 12న థియేటరల్లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ దక్కించుకుంది. వినూత్న కథనం, కామెడీ, థ్రిల్లింగ్ ఇలా ప్రేక్షకులకు ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ను అందించిందీ చిత్రం. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట్లో డీజే టిల్లు చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్లు, ఫస్ట్‌లుక్‌లు ఇదేదో బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమాగా భావించారు. కానీ విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అభిప్రాయాన్ని మార్చేసింది. కథలో ఉన్న దమ్ము, కథనంలో ఉన్న కొత్తదనం ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు.
ఇదిలా ఉంటే థియేటర్లలో ప్రేక్షకులకు అలరించిన ఈ సినిమా ఓటీటీలో (OTT)లో విడుదలైన విషయం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా మార్చి 4న స్ట్రీమింగ్ మొదలైంది. ఇక థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటింది. ఆహాలో స్ట్రీమింగ్ మొదలైన కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకొని అరుదైన విజయాన్ని సొంతం చేసుకుందీ సినిమా. ఈ విషయాన్ని ఆహా టీఎమ్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా పంచుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ముగింపులో ‘టు బి కంటిన్యూ’ అని ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పింది.
Drugs Smuggling: గత మూడేళ్లలో రూ.2,170 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్! ఈ దాయాది దేశం నుంచే సరఫరా..