
‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కేజేక్యూ’ (KJQ – కింగ్ జాకీ క్వీన్). ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథ హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సాగుతుంది. అనాథలైన పార్థ (దీక్షిత్ శెట్టి), జాకీ (శశి ఓదెల) ఇద్దరూ ప్రాణస్నేహితులుగా పెరుగుతారు. ఒక పెద్ద డాన్ (మురళీధర్ గౌడ్) ప్రాపకంలో వీరు నగరంలోనే పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్లుగా ఎదుగుతారు. అయితే వీరిద్దరి మధ్యలోకి భార్గవి (యుక్తి తరేజా) అనే యువతి ప్రవేశించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అధికారం, ఈగో మరియు ప్రేమ కలగలిసిన ఈ సంఘర్షణలో ఇద్దరు ప్రాణస్నేహితులు శత్రువులుగా ఎలా మారారు? చివరికి వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
గతంలో నాగార్జునతో ‘కేడీ’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కిరణ్ కుమార్ (కె.కె) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఆయన ఆకస్మిక మరణం తర్వాత విడుదలైన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల్లో ప్రత్యేక భావోద్వేగం నెలకొంది. మణిరత్నం ‘దళపతి’ శైలిని గుర్తుచేసే ఈ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో నటీనటుల నటన, సంభాషణలు, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో చూడడం మిస్సయిన మాస్ అండ్ యాక్షన్ సినిమాల ప్రియులు, క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వీక్షకులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..
కథను మూడు విభిన్న భాగాలుగా విభజించి పార్థ, జాకీ , భార్గవిల కోణంలో తీర్చిదిద్దారు. నేరప్రపంచంలో అధికారం కోసం తపించే వ్యక్తిగా పార్థ, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వ్యక్తిగా జాకీ, వారి మధ్య నలిగిపోయే పాత్రలో భార్గవి కనిపిస్తారు. నాగేష్ బానెల్ అందించిన విజువల్స్ నగరంలోని రస్టిక్ అట్మాస్ఫియర్, నేర ప్రపంచాన్ని సహజసిద్ధంగా చూపించగా, పూర్ణచంద్ర తేజస్వి నేపధ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..