Bujji And Bhairava: థియేటర్ల కంటే ముందే ఓటీటీలో కల్కి సందడి.. ‘బుజ్జి అండ్ భైర‌వ’ సిరీస్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

|

May 31, 2024 | 8:49 AM

ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈమూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనుండగా..అతడి జీవితంలో అతి ముఖ్యమైన బుజ్జి అనే రోబొటిక్ కారును ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. ప్రస్తుతం బుజ్జి కారు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పర్యటిస్తుంది.

Bujji And Bhairava: థియేటర్ల కంటే ముందే ఓటీటీలో కల్కి సందడి.. ‘బుజ్జి అండ్ భైర‌వ’ సిరీస్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
Bujji And Bhirava
Follow us on

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ రకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీలో అమితాబ్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈమూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనుండగా..అతడి జీవితంలో అతి ముఖ్యమైన బుజ్జి అనే రోబొటిక్ కారును ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. ప్రస్తుతం బుజ్జి కారు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పర్యటిస్తుంది.

నగరాల్లోని పలు ప్రధాన వీధుల్లో బుజ్జి కారు చక్కర్లు కొడుతుండగా..కల్కి మూవీపై మరింత ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. భైరవ, బుజ్జిని థియేటర్లలో కంటే ముందే ఓటీటీలో చూసే ఛాన్స్ ఇచ్చింది చిత్రయూనిట్. బుజ్జి అండ్ భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ రూపొందించారు. ఈ యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే నిన్న విడుదలైన ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. బుజ్జితో కలిసి భైరవ తన ప్రత్యర్థుల పని పట్టడం ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు బుజ్జి అండ్ భైరవ సిరీస్ అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ లో భైరవ పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పగా.. బుజ్జి పాత్రకు హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. ఇక మధ్యలో బ్రహ్మానందం పాత్రను కూడా తీసుకువచ్చారు. ట్రైలర్ మొత్తంలో బుజ్జి, భైరవ మధ్యలో వచ్చే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. కల్కి సినిమా నేపథ్యానికి రెండేళ్ల ముందు బుజ్జి, భైరవ మధ్య బంధం ఎలా బలపడిందో ఈ సిరీస్ ద్వారా చూపించనున్నారు. ఈ సిరీస్ తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ భాషలలో అందుబాటులోకి వచ్చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.