
తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషించారు. అలాగే కట్టప్ప పాత్రలో సత్యరాజ్, నాజర్ సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రూపొందించారు జక్కన్న. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే ప్రాజెక్టుగా రూపొందించారు.
బాహుబలి ది ఎపిక్ సినిమాను ఇటీవలే థియేటర్లలో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తన సబ్ స్క్రైబర్స్ కు క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 25 అర్దరాత్రి నుంచి నెట్ ఫిల్క్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ థ్రిల్ మిస్ అయిన అడియన్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూడొచ్చు.
దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉండే ఈ వెర్షన్ ఆద్యంతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇది అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. రెండు భాగాలను ఒకేసారి చూడడం.. అద్భుతమైన విజవల్స్ మరోసారి జనాలను ఆకట్టుకోనుంది. ఈ ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదైలన బాహుబలి ది ఎపిక్ మూవీ దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..