
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 06) కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. ఇందులో ఒక అవార్డు విన్నింగ్ సినిమా కూడా ఉంది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ బోల్డ్ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పటివరకు 25 కి పైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ మూవీ ప్రదర్శితమైంది. SXSW లండన్, శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, IFFLA, సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక వేదికలపై ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి టాలీవుడ్ ప్రముఖ హీరో దగ్గుబాటి రానా స్వయంగా తన స్పిరిట్ మీడియా సంస్థ నుంచి ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. ఐఎమ్ డీబీలోనూ 7.5 రేటింగ్ దక్కించుకున్న ఈ మూవీ పేరు సబర్ బొండా. మొదట ఈ మూవీని క్యాక్టస్ పియర్స్ అనే పేరు తెరకెక్కించారు.
రోహన్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సూరాజ్ సుమన్, జయశ్రీ జగ్తాప్ ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం కావడంతో పలు అవార్డులు గెల్చుకున్న సబర్ బోండా సినిమా శుక్రవారం అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మరాఠి భాషలో మాత్రమే ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
Between rituals of loss and moments of connection, a new sense of belonging emerges
Watch Sabar Bonda (Cactus Pears), Sundance Film Festival award winner, now on Netflix#SabarBondaOnNetflix @LotusVisualPro @bhushaan_manoj @suraaj_suman pic.twitter.com/egLzFRgDmv
— Netflix India (@NetflixIndia) February 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.