
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాసు 2 వంటి సూపర్ హిట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అలాగే ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2), కర్తవ్య వంటి సినిమాలు మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అడుగు పెట్టనున్నాయి. అయితే వీటన్నిటి మధ్య గురువారం (మే 14) అర్ధరాత్రి నుంచే ఓ తమిళ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. అంతర్జాతీయ స్పై మిషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా తమిళ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందించాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే.. విస్పోటనానికి సిద్దంగా ఉన్న న్యూక్లియర్ డివైస్‌ను కనిపెట్టడానికి ఇండియన్ స్పై ఏజెంట్స్ రష్యాలో ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభిస్తారు. అయితే రష్యాలో మిషన్ ఫెయిల్ కావడం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఈ క్రమంలో ఇండియన్ స్పై ఏజెంట్స్‌ను దేశద్రోహులుగా ముద్ర వేయాలని ప్లాన్ చేస్తారు. మరి మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసిన ఆ న్యూక్లియర్ ఆయుధాన్ని విచ్చిన్నం చేశారా? ప్రపంచ యుద్దం జరగకుండా ఇండియన్ టీమ్ ఆపరేషన్ సక్సెస్ చేసిందా? అనేది ఈ సినిమా కథ.
తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమైన కోలీవుడ్ విలక్షణ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పేరు
‘మిస్టర్ ఎక్స్’ (Mr. X). మను ఆనంద్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఆర్యతో పాటు టాలెంటెడ్ యాక్టర్ గౌతమ్ , సీనియర్ నటుడు శరత్ కుమార్, హీరోయిన్ మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే అతుల్య రవి, అనఘ, రైజా విల్సన్, జయప్రకాష్, కాళీ వెంకట్ తదితరులు వివిధ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకనేవారికి మిస్టర్ ఎక్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
The mission is live🧐 Mr. X is ready ▶️🔥
▶️ https://t.co/ky190O9n2S#MrX now streaming only on #JioHotstar #MrXOnJioHotstar #MrXNowStreaming #MrXOnJHS #JioHotstarTamil #ManuAnand @vineetjaintimes @lakku76. @venkatavmedia. @Prince_Pictures @arya_offl @realsarathkumar… pic.twitter.com/aLReYsaaCj
— JioHotstar Tamil (@JioHotstartam) May 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.