Sai Pallavi: డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైన సాయిపల్లవి థ్రిల్లర్‌ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Gargi OTT Release: థియేటర్లలో సందడి చేస్తోన్న  గార్గి అప్పుడే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆగస్ట్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలీవ్‌ ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.

Sai Pallavi: డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైన సాయిపల్లవి థ్రిల్లర్‌ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Gargi Movie

Updated on: Aug 04, 2022 | 10:56 AM

Gargi OTT Release: విరాటపర్వం తర్వాత న్యాచురల్‌ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన చిత్రం గార్గి (Gargi). గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించారు. కోర్డు డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 15 థియేటర్లలో విడుదలైంది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుద‌లైన ఈ లేడీ ఓరియంటెడ్‌ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. అనుకోకుండా అత్యాచారం కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకునే మధ్య తరగతి యువతి పాత్రలో వన్ ఉమెన్ షో గా సాయిపల్లవి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. కాగా థియేటర్లలో సందడి చేస్తోన్న  గార్గి అప్పుడే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆగస్ట్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలీవ్‌ ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.

కాగా గార్గి సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని సమాచారం. అందుకే ఓటీటీ విడుదలను ఖరారు చేస్తూ ‘థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎవరు ఊహించని క్లైమాక్స్ తో అందరిని ఆకట్టుకున్న గార్గి ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది’ అని ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్నడ భాష‌ల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆకట్టుకునే కంటెంట్‌ ఉండడంతో గార్గి సినిమాను తెలుగులో ఎస్పీ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్‌పై రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశాడు. మరి థియేటర్లలో సాయిపల్లవి సినిమాను చూడని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us