Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) ఇటీవల గంగూబాయ్ కతియావాడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..
Gangubai Kathiawadi

Updated on: Apr 20, 2022 | 4:09 PM

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) ఇటీవల గంగూబాయ్ కతియావాడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా..ముంబాయి మాఫియా క్వీన్ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అలియా ముంభై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మించగా.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి కీలకపాత్రలలో నటించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యంది. అతి తక్కువ సమయంలోనే బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో అలియా నటకు సీని విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు.. ఇక ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం గంగూబాయి కతియావాడీ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తోందా అని ఎదురుచూస్తున్నారు సీనిప్రియులు.

ఈ క్రమంలోనే తాజాగా గంగూబాయి కతియావాడీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‏ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక అలియా.. రణబీర్ నటించిన బ్రహ్మస్త్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ లవ్ బర్డ్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆలియా.. పాటు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెర‌కెక్కిస్తోన్న హ‌ర్ట్ ఆఫ్ స్టోన్‌ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో వండర్‌వుమన్‌ గాల్‌గాడోట్‌ కీలక పాత్రలో పోషిస్తోంది.

ట్వీట్..

Also Read: Mahesh Babu: మిమ్మల్ని ప్రేమించడానికి ఒక్కరోజు సరిపోదు.. అమ్మకు ప్రేమతో..

KGF Chapter 2: మనసులోని మాట బయటపెట్టిన రాకీభాయ్.. ఆ హీరోయిన్‏తో నటించాలని ఉందంటూ..

Beast Movie: బీస్ట్ సినిమా డైరెక్టర్ పై విజయ్ తండ్రి ఆగ్రహం.. ఆ కారణంతోనే ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయంటూ..

KGF Chapter 2: బాక్సాఫీస్ దగ్గర రాకీభాయ్ హవా.. కొనసాగుతున్న వసూళ్ల వేట..