
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పశ్నాపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ పరీక్ష పేపర్ లీక్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే కాదు గత కొన్నేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలు చాలా జరిగాయి. మరి అసలు ఈ పేపర్ లీకేజీల వెనక ఎవరున్నారు? అసలు వారి నెట్ వర్క్ ఎలా నడుస్తోంది? పరీక్షల పేపర్లు లీక్ అయితే వాటినే నమ్ముకున్న లక్షలాది మంది నిరుద్యోగుల పరిస్థితేంటి? సరిగ్గా ఇదే సమకాలీన అంశాలను కళ్లకు కడుతూనే తెరకెక్కించిన వెబ్ సిరీసే ఈ ‘ఎగ్జామ్’ (EXAM).. ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఎ. సర్గుణం పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ విలన్ గా నటించడం విశేషం. ఆయనతో పాటు దుషార విజయన్, అదితి బాలన్, నరేన్ మణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. గతంలో విక్రమ్ వేద మూవీతో సెన్సేషన్ క్రియేట్ క్రియేట్ చేసిన తమిళ దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి ఈ సిరీస్ ను రూపొందించారు.
మే 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్. దీనికి తోడు ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశమంతటా ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇవాళ (మే 19) అమెజాన్ ప్రైమ్ ఇండియన్ టాప్ 10 జాబితాలో 3వ స్థానంతో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ వెబ్ సిరీస్. ఇక ఐఎమ్‌డీబీలోనూ ఈ సిరీస్ కు పదికి ఏకంగా 8.4 రేటింగ్ సొంతం రావడం గమనార్హం.
ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ప్రస్తుత పోటీ పరీక్షల ప్రపంచంలో జరిగే అక్రమాలు, పేపర్ లీకేజీలు, వ్యవస్థలోని లొసుగులను ఈ ఎగ్జామ్ వెబ్ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు అనుభవించే మానసిక ఒత్తిడిని, నెట్‌వర్క్ మోసాలను ఇందులో చక్కగా చూపించారు.
Years of hard work. A lifetime of hopes. Generations of prayers
All wiped out by one leaked exam paper.#ExamOnPrime, Watch Now only on @PrimeVideoINhttps://t.co/CFJwNxTRID#Scam #Quickwatch #Paperleak@pushkargayatri@SarkunamDir@Padmak131@officialdushara @AditiBalan pic.twitter.com/fYbQPWBGzB— Wallwatcher Films (@wallwatcherfilm) May 18, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.