
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేయనున్నాయి.
అయితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ తెలుగు సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను వణికిస్తుంది. ఈ సినిమా గతేడాది థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా బీజీఎమ్ అందరినీ భయపెట్టింది. అలాగే కంటెంట్ పరంగా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూపించని సరికొత్త పాయింట్ ను ఇందులో చూపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు.ఈ విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు, ప్రేతాత్మలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆహ్వానం మేరకు ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్‌లో అతనికి సంచలన విషయాలు తెలుస్తాయి. అదే సమయంలో కాలేజీ లెక్చరర్ అవంతిక అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంది? మరి కాలేజీలో జరుగుతున్న మరణాలకు కారణమేంటి? డయానా, నాన్సీ ఎవరు? అసలు కాలేజీ లైబ్రరీలో ఏముంది? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమ పేరు శబ్ధం. గతంలో వైశాలి వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన అరివళగన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆది పినిశెట్టి (వ్యోమ వైద్యలింగం), సిమ్రాన్ (డయానా), లైలా (నాన్సీ), లక్ష్మీ మీనన్ (అవంతిక) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే రెడిన్ కింగ్ స్లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మేనర్, వివేక్ ప్రసన్న, టీఎస్సార్ శ్రీనివాసన్ తదితరులు కూడా ఈ సినిమాలో మెరిశారు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చింది. అయితే గత వారమే తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం శబ్ధం సినిమా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
*#Sabdham Now Streaming On @ZEE5Telugu* pic.twitter.com/ls5dzx3Rbg
— Classic Cinema (@ClassicCin86483) April 13, 2026
No words about this master piece 🫡
Music is peaks @MusicThaman great job for this entire film there no lag pure horror/thriller movie 📽️#sabdham#thaman #sound pic.twitter.com/uH0kCSzJh2— లోకేష్ ⚡ (@lokiiprabha) April 11, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.