ట్రైలర్ టాక్: ఈసారి రాజుగారు మరింత భయపెట్టేస్తున్నారు..!

ట్రైలర్ టాక్: ఈసారి రాజుగారు మరింత భయపెట్టేస్తున్నారు..!

‘రాజుగారి గది, రాజుగారి గది 2’ సినిమాలు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఓంకార్ డైరెక్షన్‌లో.. వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. తన తమ్ముడు ‘అశ్విన్ బాబు’ను హీరోగా పరిచయం చేస్తూ.. తీసిన ‘రాజుగారి గది’ మంచి హిట్ అయ్యింది. దీంతో.. రాజుగారి గది-2లో స్టార్ హీరోయిన్ సమంత, మామ కింగ్ నాగ్ సందడి చేశారు. ఇది కూడా మంచి కలెక్షన్లు సాధించింది. కాగా.. ఇప్పుడు ‘రాజుగారి గది-3’తో ప్రేక్షకులను మరింత […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 15, 2019 | 12:16 PM

‘రాజుగారి గది, రాజుగారి గది 2’ సినిమాలు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఓంకార్ డైరెక్షన్‌లో.. వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. తన తమ్ముడు ‘అశ్విన్ బాబు’ను హీరోగా పరిచయం చేస్తూ.. తీసిన ‘రాజుగారి గది’ మంచి హిట్ అయ్యింది. దీంతో.. రాజుగారి గది-2లో స్టార్ హీరోయిన్ సమంత, మామ కింగ్ నాగ్ సందడి చేశారు. ఇది కూడా మంచి కలెక్షన్లు సాధించింది. కాగా.. ఇప్పుడు ‘రాజుగారి గది-3’తో ప్రేక్షకులను మరింత భయపెట్టేందుకు రెండీ అయ్యింది ఓంకార్ టీం. ఇందులో.. స్టార్ హీరోయిన్ తమన్నా, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్.. అవికా గోర్, అశ్విన్, ఆలీ, ధన్‌రాజ్ పలువురు నటించారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా.. ఈరోజే రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా వుందో తెలుసుకుందామా..!

పెద్ద పెద్ద బ్యాంక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌తో రెండు డోర్లు తెరుచుకుంటాయి. భయంకరమైన ఇంటిలో.. ఓ చిన్న గుర్రపు చెక్కపై.. ఒక మనిషి ఊగుతున్నట్లు. ‘ఇదే దీన్ని పాతేసిన చోటు’ అంటూ.. గంభీరమైన ఓ వాయిస్ వినిపిస్తుంది. రెండు బ్లాక్ కార్లలోనుంచి.. స్వామీజీలు ఇంటి ముందు నిలుచోని పూజలు చేస్తున్నట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది. భయంకరమైన.. హావభావాలతో.. అవికాగోర్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాత చాలామంది ఆ దెయ్యాన్ని చూసి భయపడుతున్నట్లు ట్రైలర్‌లో కనిపిస్తూ ఉంది. సడన్‌గా ఓ అశ్విన్‌ ఎంట్రీ వచ్చి.. అతనికి దెయ్యం పట్టినట్లు ప్రవర్తించడం.. అవికను ఏడిపిస్తోన్న రౌడీలను కొడుతున్నట్లు ఉంది. కాగా.. వీడియో చివరి ఎండింగ్‌లో ఈ సినిమాను దసరాకి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కాగా.. ప్రస్తుతం ట్రైలర్‌లో భయాన్నే చూపారు కానీ.. కామెడీని చూపించలేదు. గత రెండు రాజగారి సిరీస్‌లలో కామెడీ.. ఉన్నట్లుగానే ఇందులో కూడా ఉంటుందని ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే.. తమన్నా ఎంట్రీని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. ఏదైమైనా.. ట్రైలర్ చూస్తుంటే.. మాత్రం.. పాతవాటికన్నా ఇది మరింత భయంకరంగా ఉంది. చూడాలి మరి.. ఇది ఏమేరకు అభిమానులను అలరిస్తుందో.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu