BIgg Boss 5: ఆ స్టార్‌ యాంకర్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.? సాలిడ్‌ హింట్‌ ఇచ్చిన కో యాంకర్‌.

|

Aug 08, 2021 | 5:18 PM

BIgg Boss 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతలా అట్రాక్ట్‌ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల మధ్య జరిగే అలకలు, గొడవలు, ఏడుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దేశంలోని దాదాపు...

BIgg Boss 5: ఆ స్టార్‌ యాంకర్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.? సాలిడ్‌ హింట్‌ ఇచ్చిన కో యాంకర్‌.
Bigboss 5
Follow us on

BIgg Boss 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతలా అట్రాక్ట్‌ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల మధ్య జరిగే అలకలు, గొడవలు, ఏడుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో వచ్చిన బిగ్‌బాస్‌ అందరినీ ఆకట్టుకుంది. ఇక తెలుగులో ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా సినిమాల అవకాశాలు సొంతం చేసుకున్న అప్‌కమింగ్‌ యాక్టర్లు కూడా ఉన్నారు. ఇక తెలుగులో ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు విజయవంతంగా పూర్తికాగా ఇప్పుడు 5వ సీజన్‌కు ముహుర్తం ఖరారైంది.

ఇప్పటికే బిగ్‌బాస్‌ 5వ సీజన్‌కు సంబంధించి నిర్వాహకులు ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ఈ సీజన్‌కు సంబంధించి రోజుకో వార్త నెట్టింట హంగామా చేస్తోంది. ఈ సారి షోలో నటించబోయేది వీరేనంటూ రోజుకో పేరు హల్చల్‌ చేస్తోంది. ఈ జాబితాలో ప్రముఖంగా యాంకర్‌ రవి పేరు కూడా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా యాంకర్‌ లాస్య చేసిన కొన్ని వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా సునీల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘కనబడుటలేదు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రవి, లాస్య యాంకర్‌లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లాస్య యాంకర్‌ను ఆట పట్టిస్తూ.. ‘రవి కూడా కొన్ని రోజుల్లో కనబడకుండా పోతాడేమోనని నాకు అనుమానంగా ఉంది. ఏదో హౌజ్‌లోకి వెళుతున్నారు కదా’ అని వ్యాఖ్యానించింది. ఆ మాటలకు రవి అడ్డు పడడంతో.. ‘నా అర్థం మీ ఇంట్లోకి వెళుతున్నావు కదా’ అని లాస్య కవరింగ్ చేసింది. దీంతో రవి బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఎంట్రీ దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..

Prabhas’s Salaar : డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేస్తున్న సలార్ మేకర్స్.

Big Boss Divi: భారీ ఆఫర్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. వెబ్‌ సిరీస్‌లో తళుక్కుమననున్న సొట్టబుగ్గల దివి.