Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందం గురించి ,స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి స్టైల్ కు బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతుంటారు. వింత వింత డ్రస్ లతో హొయలు ఒలక బోసే ప్రియాంక చోప్రా ఇటీవల ఓ వెరైటీ డ్రస్ తో అందరికి షాక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీలు ఏ మాత్రం అతి చేసినా కూడా ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేయడం కామన్ గా మారింది. చిన్న పొరపాటు చేసిన సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రోల్ చేసేస్తుంటారు నెటిజన్లు కొందరు.
ఇక ప్రియాంక బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలతోను మెప్పిస్తూ గ్లోబల్ బ్యూటీ మారిన విషయం తెలిసిందే. మాజీ మిస్ వరల్డ్ అయిన ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రియాంక పెళ్లాడిన విషయం తెల్సిందే.. తనకంటే దాదాపు 10 ఏళ్ళ చిన్నవాడిని పెళ్ళాడి ఈ అమ్మడు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మారో సారి నెట్టింటి ప్రియాంక చర్చాంశంగా మారింది పెళ్లి చేసుకున్న తరువాత మకాం అమెరికాకి మార్చేసినప్పటికి సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.
గ్లోబల్ స్టార్ అయినా తర్వాత ప్రియాంక డ్రసింగ్ స్టైల్ చాలా మారిపోయింది. గతంలో పలుసార్లు స్కిన్ షో చేస్తూ ప్రియాంక వేసుకున్న డ్రస్స్ లు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి డ్రస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రియాంక డ్రస్ పైన సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ప్రియాంక డ్రెస్ ఎలా ఉందంటే..
గ్రీన్ కలర్ లో గుండ్రంగా బంతిలా ఉన్నడ్రస్ లో మెరిసింది ప్రియాంక. ఆ డ్రస్ తో పీసీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు క్షణల్లో వైరల్ అయ్యాయి. ఇక నెటిజన్లు ఈ ఫొటోస్ పై రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు చూసే పోకెమోన్ ఫొటోలతో జత చేసి ట్రోల్ చేస్తున్నారు. అలాగే ప్రియాంక ను విరాట్ కోహ్లీ క్యాచ్ పడుతున్నట్టు కూడా మీమ్స్ క్రియేట్ చేశారు, ఇదిలా ఉంటే ఈ ట్రోల్స్ పైన ప్రియాంక పాజిటివ్ గా స్పంచించడం విశేషం. ఇప్పుడు పీసీ పైన చేసిన ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా ఇటీవల తన ఆత్మకథ అన్ఫినీష్డ్ అనే పుస్తకాన్ని పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. తన ఆత్మకథ పుస్తకం మార్కెట్లో సూపర్ హిట్ అయింది. ఈ పుస్తకానికి విశేష స్పందన లభిస్తున్నది.
Too funny… Thanks for making my day guys ! @LUXURYLAW #halpernstudio pic.twitter.com/TpEJIUocSJ
— PRIYANKA (@priyankachopra) February 23, 2021
— PRIYANKA (@priyankachopra) February 23, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Thalaivi: ‘తలైవి’ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ను ప్రకటించిన మూవీమేకర్స్.. ఎప్పుడో తెలుసా?