
దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. యావత్ భారత్ కోవిడ్ ప్రభావంతో అల్లాడిపోతుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో కటినంగా లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో అక్కడి పూజారులు కరోనా అంతం కావాలంటూ కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి.. పూజలు.. యజ్ఞాలు చేస్తున్నారు.
ఇక ఈ కరోనా దేవి విగ్రహంకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంకేముంది.. నెటిజన్స్ తమ బుర్రకు పని చెప్పారు. మరోసారి తమిళ నటి వనిత విజయ్ కుమార్ను లాగారు. కరోనా దేవి విగ్రహం అచ్చం వనితా విజయ్ కుమార్ మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు.. వనిత విజయ్ కుమార్, కరోనా దేవి విగ్రహంతో మీమ్స్ కూడా రెడీ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నటి వనిత విజయ్ కుమార్ స్పందించారు… ఓ మై గాడ్.. అందరూ ఈ ఫోటోతో నన్ను పోల్చుతున్నారు.. అంటూ కామెంట్స్ చేసారు. ఏదేమైనా మరోసారి నటి వనిత విజయ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో మరోసారి నానుతోంది. Vanitha Vijay Kumar
ట్వీట్స్..
Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో రామ్ గోపాల్ వర్మ సోదరుడు మృతి.. సంతాపం తెలిపిన బోనీ కపూర్…