నయన్‌-విఘ్నేష్‌కి కరోనా.. క్లారిటీ ఇచ్చిన టీమ్

దక్షిణాది లేడి సూపర్‌స్టార్ నయనతారకు కరోనా సోకినట్లు ఈ మధ్యన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెతో పాటు నయన్ లవర్ విఘ్నేష్ శివన్‌కి కూడా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి.

నయన్‌-విఘ్నేష్‌కి కరోనా.. క్లారిటీ ఇచ్చిన టీమ్

Updated on: Jun 21, 2020 | 8:09 PM

దక్షిణాది లేడి సూపర్‌స్టార్ నయనతారకు కరోనా సోకినట్లు ఈ మధ్యన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెతో పాటు నయన్ లవర్ విఘ్నేష్ శివన్‌కి కూడా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. దీంతో నయన్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తమ అభిమాన నటికి నిజంగానే వైరస్ సోకిందా..? అని నెట్టింట ప్రశ్నలు కురిపించారు. ఈ నేపథ్యంలో నయన్ టీమ్ రంగంలోకి దిగింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నయన్ టీమ్ స్పష్టం చేసింది. అవొక చెత్త పుకార్లని టీమ్ పేర్కొంది. నయనతార ఆరోగ్యంగా ఉందని, అలాంటి పుకార్లను నమ్మొద్దని కోరింది. కాగా తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. చెన్నై నగరంలోనూ రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు నగరాన్ని వదిలేసి వెళ్తున్నారు. వారి వారి ఫామ్ హౌస్‌ల్లో నివాసం ఉంటున్నారు. సీరియల్ షూటింగ్‌లకు కూడా మళ్లీ బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

Read This Story Also: కోలుకుంటున్న ఆరోగ్య మంత్రి

 

Loading...
Unable to load recommendations.
Follow Us