ఆ చిత్రంలో నాని హీరో కాదట..!

నేచురల్ స్టార్ నాని తన మొదటి సినిమా డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నానితో పాటు యంగ్ హీరో సుధీర్ బాబు కూడా ఈ చిత్రంలో నటించనున్నాడు. అంతేకాకుండా ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పోషిస్తున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుందని తెలుస్తోంది. […]

  • Ravi Kiran
  • Publish Date - 5:40 pm, Fri, 12 April 19
ఆ చిత్రంలో నాని హీరో కాదట..!

నేచురల్ స్టార్ నాని తన మొదటి సినిమా డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నానితో పాటు యంగ్ హీరో సుధీర్ బాబు కూడా ఈ చిత్రంలో నటించనున్నాడు. అంతేకాకుండా ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పోషిస్తున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుందని తెలుస్తోంది. కేవలం మాస్ ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా నాని పాత్రను తీర్చిద్దుతున్నాడట దర్శకుడు. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.