NBK 107: బాలయ్య ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. దీపావళి కానుకగా ఎన్‌బీకే107 నుంచి బిగ్ అప్‌డేట్‌..

|

Oct 20, 2022 | 6:10 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని రద్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అఖండలాంటి సూపర్‌ హిట్‌ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు అనుగుణంగానే గోపిచంద్‌ చిత్రాన్ని అత్యంత..

NBK 107: బాలయ్య ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. దీపావళి కానుకగా ఎన్‌బీకే107 నుంచి బిగ్ అప్‌డేట్‌..
Nandamuri balakrishna
Follow us on

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని రద్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అఖండలాంటి సూపర్‌ హిట్‌ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు అనుగుణంగానే గోపిచంద్‌ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్నా సినిమా టైటిల్‌ను మాత్రం రివీల్‌ చేయలేదు. ఎన్‌బీకే 107 టైటిల్‌ వర్కింగ్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. మునుపెన్నడూ కనిపించని లుక్‌లో బాలకృష్ణ వావ్‌ అనిపించేలా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపింది. దీపావళి కానుకగా అక్టోబర్‌ 21 సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది. కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుపై సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నారు.

టాలీవుడ్‌ ఇండస్ట్రీ చరిత్రలో తొలిసారి కొండారెడ్డి బురుజుపై సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇక ఈ సినిమా రెడ్డి గారు అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతీ హాసన్‌ నటిస్తుండగా విలన్‌ రోల్‌లో కన్నడ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..