Naga Chaitanya : వృషకర్మ రిలీజ్ వేళ.. శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య.. అభిమానుల సందడి..

టాలీవుడ్ హీరో నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ వృషకర్మ. డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్‌లో రూపొందించిన ఈ లేటేస్ట్ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం ఇది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ డిసెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.

Naga Chaitanya : వృషకర్మ రిలీజ్ వేళ.. శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య.. అభిమానుల సందడి..
Naga Chaitanya

Updated on: Nov 27, 2026 | 12:25 PM

టాలీవుడ్ హీరో నాగచైతన్య తన తాజా చిత్రం వృషకర్మ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల నేపథ్యంలో ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన ఆయన, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న నాగచైతన్యకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన నాగచైతన్యను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తన అభిమానులను ఆప్యాయంగా పలకరించిన ఆయన, వారితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కార్తీక మాసంలో చైతన్య ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

నాగచైతన్య కథానాయకుడిగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న వృషకర్మ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ప్రమోషనల్ అప్‌డేట్స్, విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాళహస్తీశ్వరుడి ఆశీస్సులతో నాగచైతన్య మరో ఆసక్తికర ప్రాజెక్టుతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య..

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Loading...
Unable to load recommendations.
Follow Us