Movie news ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇక సినిమాల విడుదల

లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు ప్రేక్షకాదరణ తెగ పెరిగిపోయింది. దాంతో సినిమాలను విడుదల చేయకుండా అలా వదిలేయడం కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో నేరుగా విడుదల చేయడం బెటర్ అనుకుంటున్నారు పలువురు నిర్మాతలు.

Movie news ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇక సినిమాల విడుదల

Updated on: May 15, 2020 | 2:34 PM

Movies releasing directly on OTT platforms: లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు ప్రేక్షకాదరణ తెగ పెరిగిపోయింది. దాంతో సినిమాలను విడుదల చేయకుండా అలా వదిలేయడం కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో నేరుగా విడుదల చేయడం బెటర్ అనుకుంటున్నారు పలువురు నిర్మాతలు. థియేటర్ యాజమాన్యాలు అభ్యంతరాలు చెబుతున్నా.. పలువురు నిర్మాతలు ముఖ్యంగా చిన్న నిర్మాతలు అమేజాన్, నెట్ ఫ్లిక్స్, జీ-5, సన్ నెక్స్ట్, ఆహా, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ పామ్స్‌లో సినిమాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ రకంగా విడుదల కానున్న తొలి చిత్రంగా మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ మూవీ తెలుగులో పేరు గాంచ బోతోంది.

జూన్ 19వ తేదీ నుంచి ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో “కీర్తి సురేశ్ – పెంగ్విన్” మూవీ అందుబాటులోకి రానున్నది. మ‌హాన‌టి సినిమాతో ఎంత‌గానో పేరు ప్ర‌ఖ్యాత‌ులు ద‌క్కించుకొని, తెలుగు ప్రేక్షకుల‌కి చేరువైన న‌టి కీర్తి సురేశ్. ఇటీవ‌లే నేష‌న‌ల్ అవార్డుని కూడా కైవ‌సం చేసుకున్నారు. మ‌హాన‌టి త‌రువాత కీర్తి న‌టించిన మ‌రో అద్భుత‌మైన సినిమా పెంగ్విన్. ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థ‌నంతో సాగిపోయే ఈ చిత్రానికి ఈశ్వ‌ర్ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్ ప‌తాకం పై కార్తీక్ సుబ్బ‌రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక మ‌హాన‌టి చిత్రానికి థియేట‌ర్ లోనే కాదు వ‌ర‌ల్డ్ బెస్ట్ ఆన్ లైన్ స్టీమింగ్ నెట‌వ‌ర్క్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా విశేష ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జాన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్వీన్ కావడం విశేషం. అలానే అమెజాన్ ప్రైమ్ కి సంబంధించిన డైరెక్ట్ టు సర్వీస్ స్లేట్ లో దీనితో పాటు మ‌రికొన్ని ఇత‌ర భాష చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేస్తున్నారు. పెంగ్విన్ తో క‌లిపి మొత్తం ఆరు సినిమాల‌ను నేరుగా త‌మ స్ట్రీమింగ్ స‌ర్వీస్ పై ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అధికారికంగా ప్ర‌క‌టించారు.

పెంగ్విన్‌తోపాటు పొన్ మగల్ వంధల్ (తమిళం) చిత్రాన్ని మే 29వ తేదీన, గులాబో సితాబో (హిందీ) చిత్రాన్ని జూన్ 12వ తేదీన అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు. ఇందులో గులాబో సితాబో చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించడం విశేషం. అదే విధంగా కన్నడ చిత్రం లా జూన్ 26వ తేదీన, మరో కన్నడ చిత్రం ఫ్రెంచ్ బిర్యానీ జులై నాలుగో తేదీన విడుదల చేయబోతున్నారు. విద్యాబాలన్ నటించిన శకుంతలాదేవీ చిత్రాన్ని కూడా ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతుండగా.. ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు. అదే విధంగా సుఫియాం సుజాతాయం మలయాళం చిత్రాన్ని కూడా అమేజాన్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలు రానున్న మూడు నెలల్లో ప్రైమ్ వీడియోపై ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు మరియు టెరిటరీస్‌లలో వీటిని వీక్షించవచ్చు.