Wild Dog Twitter Review: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో సయామీ ఖేర్ కీలక పాత్రలో నటించింది. దీనికి థమన్ సంగీతం అందించాడు.
ఈ సినిమా ప్రారంభం నుంచి నాగార్జున అభిమానులు ఈ మూవీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలై ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ వర్మ పాత్రలో నటించిన నాగ్ లుక్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు.
హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్ల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 2న ఘనంగా విడుదలైంది. ఈ సినిమాను ముందే చూసిన ప్రీమియర్ ఆడియన్స్ పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సినిమా చాలా బాగుందని.. ఫస్టాఫ్ సూపర్ అని.. ఎక్కడ కూడా కథను పక్కదారి పట్టించకుండా…. స్టోరీపైనే ఫోకస్ పెడుతూ.. డైరెక్టర్ కథను నడిపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ నాగ్ అదరగొట్టేశారని.. ఇక ఎస్కేపింగ్ సీన్ సూపర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే సెకండాఫ్ కూడా చాలా థ్రిల్లింగ్‌గా తీశారని.. నాగ్ అసలైన థ్రిల్లింగ్ అంటే ఎంటో చివరి 20 నిమిషాల్లో చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్ సీన్స్, ఎమోషన్ సీన్స్ కూడా అద్భుతంగా తీసారని ట్వీట్ చేస్తున్నారు. ఇక ఇందులో నాగ్ ఏసీపీ పాత్రలో ఒదిగిపోయారని.. కానీ అక్కడక్కడ కాస్తా సాగదీశారని కామెంట్స్ చేశారు.
ట్వీట్స్..
#WildDog Overall An Average Action Entertainer!
The film sticks to the point from the first scene and the action scenes have been shot well. Nagarajuna plays his part well!
On the flipside, the movies pace is relatively slow and has very few high moments.
Rating: 2.75/5
— venkyreviews (@venkyreviews) April 2, 2021
#WildDog from USA??
Gripping, To the point, Zero Non-Sense film. @MusicThaman BGM? is a major plus. @iamnagarjuna is great as Vijay varma.
Wedding Reception Scene is the Seat edge sequence. @MatineeEnt #Wilddogreview— pradyumna reddy (@pradyumnavicky) April 2, 2021
Just now completed my show #WildDog @iamnagarjuna you’re awesome in this type of role and superb action sequences.. and the supporting characters done great job.. Special mention to Director for his crispy way of story telling and screenplay.
BGM is Good #WildDogOnApril2nd pic.twitter.com/FhIzYr5hER— Naga Sravanthi (@Sravanthicuty) April 2, 2021
Also Read:
Sarangadariya: ‘లవ్‌స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..