Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ.. ఆనంది చేసిన బయోపిక్ మెప్పించిందా..?

90లో ఉత్తరాంధ్రను ఒక దశాబ్దం పాటు ఊపేసిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ.. ఆనంది చేసిన బయోపిక్ మెప్పించిందా..?
Garividi Lakshmi Movie Revi

Edited By:

Updated on: Oct 17, 2026 | 12:03 PM

మూవీ రివ్యూ: గరివిడి లక్ష్మి

నటీనటులు: ఆనంది, రాగ్ మయూర్, నరేశ్, రాశి, షకలక శంకర్, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కోయ్య, శరణ్య ప్రదీప్, కంచరపాలెం కిశోర్, నితిన్ ప్రసన్న, వైవా రాఘవ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటర్: రవితేజ గిరిజాల

సంగీతం: చరణ్ అర్జున్

నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌

దర్శకుడు: గౌరి నాయుడు జమ్ము

90లో ఉత్తరాంధ్రను ఒక దశాబ్దం పాటు ఊపేసిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

శ్రీకాకుళం జిల్లాలో గరివిడి అని ఒక చిన్న ఊర్లో లక్ష్మి (ఆనంది) 1965లో దేవుడమ్మ (రాశి) దంపతులకు పుడుతుంది. చిన్నప్పుడే నాన్న వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆ తర్వాత 12 ఏళ్లకే ఆమెకు పెళ్లి చేస్తుంది తల్లి. కానీ అతడు కూడా మోసం చేసి వెళ్లిపోవడంతో జీవితం మీద విరక్తి చెందుతుంది. ఇలాంటి సమయంలో ఆమెకు పాట బాసటగా నిలుస్తుంది. తనలోని కళాకారిణికి మరింత పదును పెడుతూ బుర్రకథలు నేర్చుకుంటుంది. సొంతంగా ట్రూప్ పెట్టాలి అనుకుంటున్న సమయంలో సత్తిబాబు (రాగ్ మయుర్) లక్ష్మికి అండగా నిలబడతాడు. అలా ఇద్దరు కలిసి మొదలు పెట్టిన గరివిడి లక్ష్మి బుర్రకథలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయి. ఈ క్రమంలోనే ఆమెకు పేరుతో పాటు హోదా డబ్బు కూడా వస్తాయి. కానీ అదే సమయంలో ఆమె పేరు వాడుకుంటూ ఎంతో మంది ఆమెను మోసం చేస్తారు. చివరికి గరివిడి లక్ష్మి జీవితం ఎలా ముందుకు వెళ్ళింది అనేది ఈ సినిమా కథ..

కథనం:

బయోపిక్స్ తీయాలి అనుకున్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.. అలాగే కొన్ని డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవడం చాలా కష్టం. గరివిడి లక్ష్మి బయోపిక్ మాత్రం చాలా హానెస్ట్ గా చేసినట్టు అనిపిస్తుంది. అని ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నారని విషయం చాలా మందికి తెలియదు. ఇది ఎప్పుడో జరిగిన కథ కాదు ఒక 30 ఏళ్ల కింద జరిగిన స్టోరీ మాత్రమే. శ్రీకాకుళం జిల్లాలో ఒక 10 ఏళ్ల పాటు తన బుర్రకథలతో అందరినీ ఊపేసిన గరివిడి లక్ష్మి అంటే ఎవరో ఇంతవరకు చాలామందికి తెలియదు. ఆ గుర్తింపు కోసమే ఈ సినిమా తీసారు అని అర్థమవుతుంది. ఈ బయోపిక్ పూర్తిగా మహానటి టెంప్లేట్ లోనే సాగింది. అసలు కథ ఏంటో తెలియకుండా, అంచనాలే లేకుండా వెళ్ళిన సినిమాలు సర్ప్రైజ్ చేస్తే భలే కిక్కు వస్తుంది.. గరివిడి లక్ష్మి అలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది. నిజంగా ఆమె ఎవరు ఏం చేసేవారు అనేది చాలామందికి ఎలాంటి ఐడియా లేదు.. కానీ సినిమా మొదలైన కాసేపటికే ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అర్థమైంది.. మనం చాలా సినిమాల్లో చూసిన జానపదాలు ఆమె నోటి నుంచి వచ్చినవే అని తెలిసింది.. చదువు లేకపోయినా జానపదాన్ని దశాబ్దం పాటు ఏలింది అనేది అర్థమైంది.. ఈ సినిమా చూస్తున్నంత సేపు మహానటి గుర్తుకొచ్చింది. సేమ్ టు సేమ్ స్క్రీన్ ప్లే వాడుకున్నాడు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము. చాలావరకు మహానటి సినిమా పోలికలు ఇందులో కూడా కనిపిస్తాయి.

విచిత్రంగా క్యారెక్టర్స్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి.. చిన్నతనం, అక్కడ ఎదురైన కష్టాలు, జానపదం లోకి ఎంట్రీ, సూపర్ స్టార్ డమ్.. వెల్లువలా వచ్చే డబ్బు, చుట్టుపక్కల చేరిన మనుషులు, అవకాశాల కోసం ఆమె పేరును వాడుకున్న విధానం..
ఇలా వెళ్ళిపోతుంది గరివిడి లక్ష్మి కథ.. ఫస్ట్ ఆఫ్ ఆమె హై చూపిస్తే.. సెకండ్ హాఫ్ లో ఆమెకు జీవితంలో తగిలిన గాయాలను చూపించారు. ఇదంతా ఒక సినిమా రూపంలో ఒక దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సినిమాలో అత్యంత ఆసక్తికరమైన విషయం పాటలు. దాదాపు 20 కి పైగా పాటలు ఈ సినిమాలో ఉన్నాయి కానీ ఒకటి కూడా బోర్ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఖచ్చితంగా ఈ సినిమా అలరిస్తుంది.

నటీనటులు:

ఆనంది ఆ పాత్రకు ప్రాణం పోసింది.. గరివిడి లక్ష్మి అనే పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. రాగ్ మయుర్ తన క్యారెక్టర్ కు న్యాయం చేశాడు.. సీనియర్ నరేష్ పాత్ర సినిమాకు అత్యంత కీలకం. అలాగే శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, అవసరాల శ్రీనివాస్ పాత్రలు అవసరం మేరకు ఉన్నాయి. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాశికి కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు కనిపించని హీరో సంగీత దర్శకుడు చరన్ అర్జున్.. పాటలు చాలా బాగున్నాయి. అలాగే రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు గౌరీ నాయుడు ఒక మంచి కథను తీసుకొని చాలా మంచి ప్రయత్నం చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా గరివిడి లక్ష్మి.. ఒక మంచి బయోపిక్..!

Loading...
Unable to load recommendations.
Follow Us