బాలీవుడ్‌లో మళ్లీ ‘మీటూ’.. తాప్సీపై విమర్శల వెల్లువ

బాలీవుడ్‌లో మళ్లీ మీటూ ఉద్యమం మొదలైంది. దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు దుస్తులు తీయమన్నాడని

బాలీవుడ్‌లో మళ్లీ మీటూ.. తాప్సీపై విమర్శల వెల్లువ

Updated on: Sep 20, 2020 | 2:36 PM

Netizens Fire on Taapsee: బాలీవుడ్‌లో మళ్లీ మీటూ ఉద్యమం మొదలైంది. దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు దుస్తులు తీయమన్నాడని నటి పాయల్ ఘోష్ ఆరోపణలు చేశారు. దీంతో కొంతమంది అనురాగ్‌కి మద్దతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో తాప్సీపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ విషయంలో అనురాగ్‌కి మద్దతును ఇస్తూ తాప్సీ వ్యాఖ్యలు చేసింది. నువ్వు ఒక ఫెమినిస్ట్‌వని నాకు తెలుసు. నీతో సెట్స్‌లో కలుస్తా అని కామెంట్ పెట్టారు. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నటుడు నానా పటేకర్‌పై మీటూ ఆరోపణలు వచ్చినప్పుడు అసలు నిజం తెలుసుకోకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తాప్సీ మాట్లాడారని, కానీ ఇప్పుడు మాత్రం నా ఫ్రెండ్‌ అంటూ అనురాగ్‌కి మద్దతును ఇస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ బుద్ది మరోసారి భయటపడిందంటూ ట్వీట్లు పెడుతున్నారు.

కాగా గతంలో నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా మీటూ ఆరోపణలు చేశారు. దీనిపై కేసు కూడా నమోదు కాగా.. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఆరోపణల్లో నిజం లేదని నానా పటేకర్‌కి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read More:

Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. బిగ్‌బాస్ నుంచి హారిక అవుట్‌..!

ఏపీ ఫైబర్‌కి, లోకేష్‌కి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధమే: వేమూరి

Follow Us