
ప్రస్తుతం తమిళనాడు థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా మందాడి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులో తమిళ హాస్యనటుడు, హీరో సూరితోపాటు తెలుగు యంగ్ హీరో సుహాస్ సైతం నటించారు. అయితే ఇన్నాళ్లు కామెడీ పాత్రలతో అలరించిన సూరికి ఈ చిత్రం నటుడిగా మంచి మార్కును తెచ్చిపెట్టింది. అలాగే చిన్న చిన్న సినిమాలతో జాతీయ అవార్డ్ దృష్టిని ఆకర్షించిన సుహాస్.. ఈ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా సూరి, సుహాస్ నటనపై అడియన్స్, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలిసారిగా దర్శకత్వం వహించిన మడిమారన్ పుగళెంతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో మహిమా నంబియార్, సత్యరాజ్, సుహాస్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసింది.
ఈ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే రూ.30 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సినిమా కోసం సూరికి పారితోషికంగా రూ. 20 కోట్లు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. సుహాస్‌కు రూ. 3 కోట్లు, సత్యరాజ్‌కు రూ. 2 కోట్లు, మహిమా నంబియార్‌కు రూ. 1 కోటి చెల్లించగా, ఈ సినిమా బడ్జెట్ రూ. 75 కోట్లుగా చెబుతున్నారు.
మందాడి సినిమా విషయానికి వస్తే.. సముద్రంలో జరిగే సాంప్రదాయ పడవ పందేల నేపథ్యంతో తెరకెక్కిన ఒక పవర్‌ఫుల్ కోస్టల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. తీరప్రాంత గ్రామంలోని మత్స్యకారుల మధ్య జరిగే పడవ పందేలు, పంతాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సముద్రంలో చేపల వేటలో, పడవ పోటీలలో తిరుగులేని జాలరి అయిన ముత్తుకాళి (సూరి), కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఊరికి దూరంగా ఉంటాడు. మరోవైపు అదే ప్రాంతాన్ని శాసిస్తూ, సునామీ రైడర్స్ జట్టుతో పడవ పందేలను గెలుస్తూ అహకారంతోతో ఉంటాడు సాట్టా పులి (సుహాస్). మత్స్యకారులు సమస్యలను పరిష్కరించడానికిముత్తుకాళి మళ్లీ తన గ్రామానికి తిరిగి వస్తాడు. ఈ ఇద్దరి మధ్య సాగే పగ, ప్రతీకారమే ఈ సినిమా.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‌కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..