సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
ఈ ముద్దుగుమ్మకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్.
సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన నయనతారను దర్శకుడు సత్యన్ అంతికాడ్ గుర్తించి మలయాళ చిత్రంలో అవకాశం ఇచ్చారు.
నయనతార 2003లో మలయాళ చిత్రం మనస్సినక్కరేతో హీరోయిన్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత మలయాళంలో మరిన్ని చిత్రాల్లో నటించింది.
2005లో అయ్యా సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అనంతరం తెలుగులో లక్ష్మి, బాస్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ నయనతార తన కెరీర్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది.
నయనతార 2026లోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. యశ్ ప్రధాన పాత్రలో నటించిన టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్రంలో గంగ అనే కీలక పాత్రలో కనిపించింది.
నయన్ ఒక్కో సినిమాకు సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఆమె ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా