AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో పెద్దగా ఆడలేదు.. కానీ ఓటీటీలో దుమ్మురేపుతోన్న యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఈ మధ్యన థియేటర్లలో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో రికార్డు వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. అలా గత వారం ఓటీటీలోకి వచ్చేసిన ఓ ఫ్లాప్ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

OTT Movie: థియేటర్లలో పెద్దగా ఆడలేదు.. కానీ ఓటీటీలో దుమ్మురేపుతోన్న యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 14, 2026 | 3:46 PM

Share

ఈ మధ్యన సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు, అభిప్రాయాలు బాగా మారిపోతున్నాయి. ఎవరు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో అసలు అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా ఈ మధ్యన థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేసరికి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో థియేటర్ల వద్ద డిజాస్టర్‌గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం అదరగొడుతున్నాయి. ఇప్పుడ మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా గత వారమే ఓటీటీలోకి వచ్చేసింది. అనూహ్యంగా ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వేదికపై టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ సినిమా మకుటం. ఈ సినిమాలో విశాల్ ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అభిమానులను బాగానే మెప్పించింది. అయితే తీరా థియేటర్లలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన మకుటం సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. రెగ్యులర్ యాక్షన్ సినిమా అని విశాల్ మూవీపై ఆడియెన్స్ పెదవి విరిచారు. దీనికి తోడు విశాల్ సినిమాకు పోటీగా సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ కావడం, సూపర్ హిట్ టాక్ రావడంతో మకుటం సినిమాకు ప్రతికూల అంశాలు గా మారాయి.

థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన మకుటం సినిమా నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఈ సినిమా ఓటీటీ ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. సుమారు మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమా స్క్రీన్ ప్లేపై థియేట్రికల్ రిలీజ్ సమయంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, విశాల్ నటన, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా, తండ్రీకొడుకుల మధ్య సాగే పొలిటికల్ వార్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ కు ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. అందుకే మకుటం సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు.

విశాల్ మకుటం సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us