వరుస ఆఫర్స్.. దుమ్మురేపుతున్న భాగ్యశ్రీ బోర్సే

14 September  2026

Rajeev 

Pic credit - Instagram

తెలుగు సినీ ప్రేక్షకులకు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో పరిచయమైన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతోంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైంది.

తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘ఆపరేషన్ గంగా’ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

2017లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె పలు ప్రింట్ క్యాంపెయిన్లు, ఫ్యాషన్ షూట్లు, టెలివిజన్ కమర్షియల్స్‌లో కనిపించింది.

రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’. 2024లో విడుదలైన ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. 

2025లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్, దుల్కర్ సల్మాన్‌తో కాంతా, రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా వంటి చిత్రాల్లో నటించింది.

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ తో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు శివకార్తికేయన్‌తో ‘సెయోన్’ అనే సినిమా చేస్తుంది