Ram Charan Manchu Family: శనివారం దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను పాటిస్తూ అందరూ ఇళ్లలోనే పండుగను జరుపుకున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ తమ ఇళ్లలో దీపావళిని జరుపుకున్నారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీలో జరిగిన దీపావళి వేడుకల్లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. (కమెడియన్ పట్ల విజయ్ సేతుపతి దాతృత్వం.. లక్షరూపాయలు ఇచ్చిన హీరో)
నాకు ఎంతో ఇష్టమైన సోదరుడు రామ్ చరణ్, ఇష్టమైన అక్క మంచు లక్ష్మితో మంచి సమయం గడిచింది. దీపావళి ఫెస్టివల్‌ని నాకు ఇష్టమైన వారితో జరుపుకున్నా అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తుండగా, చిరంజీవి ఆచార్యలోనూ కనిపించనున్నారు. మరోవైపు మనోజ్, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో కనిపించనున్నారు. (మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుతున్న నటుడు.. ట్యూన్స్ రెడీ చేస్తున్నాడా..!)
Had a great time with my sweetest brother @AlwaysRamCharan and my lovely akka @LakshmiManchu ?
Celebrated the real Festival of Lights with my Bestiessss ❤️❤️❤️❤️#Diwali #Diwali2020 #SeethaRAMaRajuCHARAN#ManojManchu #LakshmiManchu pic.twitter.com/mlXF5ar62L— Manoj Manchu??❤️ (@HeroManoj1) November 17, 2020