టీచర్ ఆవేదన.. లైవ్‌లో ఏడ్చేసిన మధుమిత

| Edited By:

Sep 21, 2020 | 3:21 PM

ఆన్‌లైన్ క్లాసుల పేరిట తమ పిల్లలు చదివే స్కూల్‌ యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేస్తుందంటూ ఇటీవల నటుడు శివబాలాజీ

టీచర్ ఆవేదన.. లైవ్‌లో ఏడ్చేసిన మధుమిత
Follow us on

Madhumitha emotional live: ఆన్‌లైన్ క్లాసుల పేరిట తమ పిల్లలు చదివే స్కూల్‌ యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేస్తుందంటూ ఇటీవల నటుడు శివబాలాజీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆ స్కూల్‌ యాజమాన్యంపై ఆయన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ అంశంపై ఓ ఛానెల్‌ లైవ్‌లో పాల్గొన్న మధుమిత భావోద్వేగానికి గురయ్యారు.

మధుమిత చర్చలో ఉండగా ఆ స్కూల్‌లో పనిచేసిన ఓ టీచర్‌ ఫోన్‌ చేసింది. ఈ స్కూల్‌లో తాను  ఏడాది పాటు పని చేశానని.. అప్పుడే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని.. అయితే ఈ టైమ్‌లో నీకెందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని స్కూల్ యాజమాన్యం ప్రశ్నించిందని ఆ టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టీచర్ చెప్పిన విషయాన్ని విన్న మధుమిత లైవ్‌లోనే ఎమోషనల్ అయ్యి ఏడ్చేశారు. స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More:

ప్రభాస్ కోసం లెజండరీ దర్శకుడు.. ఏడు సంవత్సరాల తరువాత రీఎంట్రీ

వైఎస్‌ వివేకా హత్య కేసు: ఇవాళ ఆ ఆరుగురిని ప్రశ్నించనున్న సీబీఐ