Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై తొలిసారిగా స్పందించిన పూరి జగన్నాథ్‌!

డైనమిక్ స్టార్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఛార్మిల విషయంలోనూ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లలున్న పూరి, ఛార్మితో ప్రేమలో ఉన్నాడని, ఈ కారణంగానే తన భార్యతో విడాకులు కూడా తీసుకోబోతున్నాడని పుకార్లు షికార్లు..

Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై తొలిసారిగా స్పందించిన పూరి జగన్నాథ్‌!
Puri Charmme

Updated on: Aug 19, 2022 | 8:54 PM

Director Puri Jagannadh and producer Charmme rumoured love affair: ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు మరింత ఆసక్తికనబరుస్తారు. ముఖ్యంగా వారి ప్రేమలు, పెళ్లిళ్లు, లివింగ్‌ రిలేషన్‌షిప్‌ వంటి విషయాలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో ఆ వార్త అంతటా పాకిపోతుంది. ఈ క్రమంలో డైనమిక్ స్టార్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఛార్మిల విషయంలోనూ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లలున్న పూరి, ఛార్మితో ప్రేమలో ఉన్నాడని, ఈ కారణంగానే తన భార్యతో విడాకులు కూడా తీసుకోబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై పూరి, ఛార్మి ఇప్పటివరకు పెదవి విప్పలేదు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా రూపొందిన సినిమా ‘లైగర్‌. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘లైగర్‌’ మువీ ఆగస్టు 25న విడుదలవ్వనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రం లైగ‌ర్ చిత్ర ప్రమోష‌న్లలో ఈ చిత్ర బృంధం బిజీగా ఉంది. ఈ సందర్భంగా పూరి మీడియాతో మాట్లాడుతూ ఛార్మీతో తనకున్న అనుబంధం గురించి తనదైన శైలిలో స్పందించారు.

’13 ఏళ్ల వయసు నుంచి ఛార్మి నాకు తెలుసు. రెండు దశాబ్దాలుగా ఆమె ఎలా కష్టపడి పనిచేస్తుందో చూస్తున్నాను. ఆమె 50 ఏళ్ల మహిళ అయితే ఆ విషయం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆమె లావుగా ఉన్నా, మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎవరికీ ఏ బాధ ఉండదు. కానీ ఛార్మి వయసులో ఉంది. అందుకే మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. ప్రతి జంట మధ్య ఉండే రొమాంటిక్‌ యాంగిల్‌ ఉంటుందని నేను నమ్ముతాను. ఐతే అది చాలా త్వరగా చచ్చిపోతుంది. మనందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఆ విధమైన వాంఛలు కొన్ని రోజుల్లోనే పోతాయని అందరికీ తెలుసు. స్నేహం మాత్రమే కలకాలం ఉంటుందంటూ’ ఛార్మితో తనకున్న రిలేషన్‌ గురించి పూరి చాలా ఆసక్తికరంగా వివరించారు.