టాలీవుడ్‏లో మరో థ్రిల్లర్ సినిమా.. డిఫరెంట్ టైటిల్‏ను ఫిక్స్ చేసిన చిత్ర బృందం.. త్వరలోనే ఫస్ట్ లుక్..

| Edited By: Pardhasaradhi Peri

Dec 15, 2020 | 8:00 PM

నందమూరి కల్యాణ్ రామ్, అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే, నివేథా థామన్ కలిసి నటించిన 118 మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ సినిమాటోగ్రాఫర్

టాలీవుడ్‏లో మరో థ్రిల్లర్ సినిమా.. డిఫరెంట్ టైటిల్‏ను ఫిక్స్ చేసిన చిత్ర బృందం.. త్వరలోనే ఫస్ట్ లుక్..
Follow us on

నందమూరి కల్యాణ్ రామ్, అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే, నివేథా థామన్ కలిసి నటించిన 118 మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ తెరకెక్కించారు. తాజాగా కేవి గుహన్ మరో సరికొత్త థ్రిల్లర్ తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీకి డబ్ల్యూడబ్ల్యూడబ్యూ (హూ, వేర్, వై) అనే టైటిల్‏ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. అథిత్ అరుణ్, రాజశేఖర్ కుమార్తె శివాని జంటగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ బ్యానర్‏పై డాక్టర్ రవి పి. రాజు దట్ల నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి పి.రాజు మాట్లాడుతూ.. “కేవి గుహన్ తెరకెక్కించిన 118 మూవీ విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన థ్రిల్లర్ కథాంశంతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీని చిత్రీకరిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్‏లో హై టెక్నికల్ వేల్యూస్‏తో ఈ సినిమా రాబోతుంది. ఈ మూవీకి సిమన్ కె.కింగ్ సంగీతం అందిస్తుండగా.. మిర్చికిరణ్ డైలాగ్స్ అందిస్తున్నారు. టెక్నికల్‏గా మాకు మంచి సపోర్ట్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తొందర్లోనే ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేస్తాం” అని తెలిపారు.