కేజీఎఫ్ చాప్టర్ 2 అప్డేట్… సోలో ఫైటర్ ఈజ్ బ్యాక్… అండ్ రైజ్ ఆఫ్ అధీరా… అంటూ కేజీఎఫ్ 2 పాత్రలను పరిచయం….

దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఎంతో ఎదురు చూసేలా చేస్తున్న సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా యూనిట్ తాజాగా మూవీ అప్డేట్‌ను విడుదల చేసింది.

  • Tv9 Telugu
  • Publish Date - 11:17 am, Mon, 21 December 20
కేజీఎఫ్ చాప్టర్ 2 అప్డేట్... సోలో ఫైటర్ ఈజ్ బ్యాక్... అండ్ రైజ్ ఆఫ్ అధీరా... అంటూ కేజీఎఫ్ 2 పాత్రలను పరిచయం....

దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఎంతో ఎదురు చూసేలా చేస్తున్న సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా యూనిట్ తాజాగా మూవీ అప్డేట్‌ను విడుదల చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 గ్లిమ్స్ పేరుతో ఒక నిమిషం నిడివి ఉన్న హిందీ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్…

సోలో ఫైటర్ ఈజ్ బ్యాక్….

గ్లిమ్స్ పేరుతో వదిలిన వీడియోలో సోలో ఫైటర్ ఈజ్ బ్యాక్ అంటూ హీరో యష్‌ చాప్టర్ లుక్‌ను రివీల్ చేసింది. అంతేకాకుండా కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్‌ కథలోని కొన్ని డైలాగ్స్‌ను చాప్టర్ 2కు కొనసాగింపుగా…క్యా చాహియే తెరకు… దునియా… అంటూ వినిపించాయి. హిస్ ఓన్ కింగ్‌డమ్…రివార్డ్, ఫర్ ది క్యాప్చర్ 2,500… అంటూ యష్‌కు సంబంధించిన లుక్స్‌ను వీడియోలో చూపించారు.

 

ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త్ పాత్రను రైజ్ ఆఫ్ అధీరా పేరుతో పరిచయం చేశారు. సంజయ్‌తో ఒక డైలాగ్ సైతం గ్లిమ్స్‌లో చెప్పించారు. అంతేకాకుండా యష్ కుర్చీలో కూర్చున్న ఒక స్టిల్‌ను సైతం మూవీ టీం విడుదల చేసింది. ఆ స్టిల్‌లో చాప్టర్ 2 టీజర్‌ను 2021 జనవరి 8వ తేదీ ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.