‘వంటలక్కా’.. నీకు ‘దీపం’ అవార్డు వచ్చిందోచ్!

'వంటలక్కా'.. నీకు 'దీపం' అవార్డు వచ్చిందోచ్!

కార్తీక దీపం.. బుల్లితెరలో ప్రసారమయ్యే ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మాలో ఇది మొదలైన దగ్గర నుంచి అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్‌తో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. దీపా అనే పాత్రలో కేరళ టీవీ నటి ప్రేమి విశ్వనాధ్ నటిస్తుండగా.. ఆమె నటనకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే కేరళలో పలు సీరియల్స్‌లో నటించిన ఈమె ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఇదంతా పక్కన పెడితే.. తెలుగులో మాత్రం స్టార్ […]

Ravi Kiran

|

Oct 21, 2019 | 5:39 PM

కార్తీక దీపం.. బుల్లితెరలో ప్రసారమయ్యే ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మాలో ఇది మొదలైన దగ్గర నుంచి అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్‌తో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. దీపా అనే పాత్రలో కేరళ టీవీ నటి ప్రేమి విశ్వనాధ్ నటిస్తుండగా.. ఆమె నటనకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే కేరళలో పలు సీరియల్స్‌లో నటించిన ఈమె ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది.
ఇదంతా పక్కన పెడితే.. తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్లకు సైతం లేని ఫ్యాన్ ఫాలోయింగ్ దీపా(ప్రేమి విశ్వనాధ్)కు సోషల్ మీడియాలో దక్కుతోంది. వంటలక్కగా తెలుగు రాష్ట్రాల మహిళా ప్రేక్షకుల నీరాజనాలు పొందుతూ.. వారి అభిమానాన్ని చూరగొంటోంది. మూడేళ్ళుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌కు విశేషదారణ లభిస్తోంది. కాగా, తాజాగా ఈ కార్తీక దీపం సీరియల్‌ ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. స్టార్ మా నిర్వహించే ‘స్టార్ పరివార్ అవార్డ్స్’లో వంటలక్క దీపకు  ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు లభించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu