‘అవును.. మేము విడిపోయం’ సడెన్‌గా విడాకులు ప్రకటించి షాకిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ

మా విడాకుల గురించి ఎవరూ అసభ్యంగా మాట్లాడవద్దు. దయచేసి మాలో ఎవరిపైనా ద్వేషం చూపించకండి. మమ్మల్ని జడ్జ్‌ చేయకండి. దీని నుంచి బయటపడటానికి చాలా కష్టపడుతున్నాను. జీవితంలో అన్నీ మర్చిపోయి ముందుకు సాగడానికి మనం చేసే పనే సహాయపడుతుంది. నేను ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా పనిచేశాను. నటిగా నా ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నా..

అవును.. మేము విడిపోయం సడెన్‌గా విడాకులు ప్రకటించి షాకిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ
Chaitra Vasudevan

Updated on: Jul 30, 2023 | 7:37 AM

కన్నడ నటి, యాంకర్‌ అయిన చైత్ర వాసుదేవన్‌ ఐదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. తన భర్తతో విడిపోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా స్వయంగా ప్రకటించింది. కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌ 7తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త సత్య నాయుడును 2017లో వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పలు కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘డియర్‌ ఆల్‌.. ఎన్నో నెలలు బాగా ఆలోచించిన తర్వాత మీ అందరికీ ఈ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. సత్య, నేను విడిపోయాం. మా విడాకుల గురించి ఎవరూ అసభ్యంగా మాట్లాడవద్దు. దయచేసి మాలో ఎవరిపైనా ద్వేషం చూపించకండి. మమ్మల్ని జడ్జ్‌ చేయకండి. దీని నుంచి బయటపడటానికి చాలా కష్టపడుతున్నాను. జీవితంలో అన్నీ మర్చిపోయి ముందుకు సాగడానికి మనం చేసే పనే సహాయపడుతుంది. నేను ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా పనిచేశాను. నటిగా నా ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నానంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట సడన్‌గా  విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాకయ్యారు. ఇకపోతే బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న చైత్రకు సొంతగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అలాగే ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us