మరోసారి ఆ స్టార్ హీరో పై సంచలన కామెంట్లు చేసిన కంగన .. అతడి ఏడుపు మళ్ళీ మొదలైందంటూ…

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి హాట్ టాపిక్  అయ్యింది. యంగ్ హీరో సుశాంత్ మరణం తర్వాత కంగనా ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

మరోసారి ఆ స్టార్ హీరో పై సంచలన కామెంట్లు చేసిన కంగన .. అతడి ఏడుపు మళ్ళీ మొదలైందంటూ...
Rajeev Rayala

|

Dec 15, 2020 | 9:16 PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి హాట్ టాపిక్  అయ్యింది. యంగ్ హీరో సుశాంత్ మరణం తర్వాత కంగనా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తాజాగా స్టార్ హీరో హృతిక్ రోషన్ పై మరోసారి విమర్శలు చేసింది కంగన. గతంలో ‘క్రిష్ 3’ సమయంలో హృతిక్  తనతో ప్రేమలో ఉన్నాడని, ఇద్దరం కలిసి డేటింగ్ చేశామని, ఆతర్వాత విభేదాల కారణంగా విడిపోయామని కంగన తెలిపింది. ఇక హృతిక్ సతీమణి సుహానే అతడిని విడిచి పెట్టడానికి అమ్మాయిలతో తనకున్న ఎఫైర్లే కారణమని తీవ్ర ఆరోపణలు చేసింది కంగన. ఇక తనకు కంగనతో ఎటువంటి సంబంధం లేకున్నా ఆమె మెయిల్ అకౌంట్ నుంచి చాలా  మెయిల్స్ వచ్చాయని.. అది తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని 2016లో హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసు పై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. దాంతో హృతిక్ తరపు న్యాయవాది ముంబై పోలీసులకు తాజాగా లేఖ రాశారు.  దాంతో ఈ కేసు సైబ‌ర్ సెల్ క్రైమ్ ఇంట‌లిజెన్స్ యూనిట్‌కి  ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింది. ఈ నేపథ్యంలో  మరోసారి ట్వీట్ లతో రెచ్చిపోయింది కంగన. “అతడితో విడాకులు అయిన చాలా ఏళ్ల తర్వాతా మళ్లీ ఏడుపు కథ మొదలైంది. నాతో  బ్రేకప్ అయ్యి చాలా ఏళ్లైపోయింది. మ‌రో మ‌హిళ‌తో డేట్‌కు వెళ్లేందుకు అతడు ఇష్ట‌ప‌డ‌టం లేదు. నా వ్యక్తిగత జీవితంలో నేను ముదుకుసాగుతున్నాను.. అతను మాత్రం మళ్ళీ డ్రామా మొదలుపెట్టాడు. ఆ చిన్నపాటి అఫైర్ గురించి ఇంకెంత దూరం వెళ్తావు హృతిక్ “ అంటూ ట్వీట్స్ తో చెలరేగింది. మరి దీనిపై హృతిక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu