తాజ్‌తో చందమామ.. ఒకేచోట రెండు అద్భుతాలు

తాజ్‌తో చందమామ.. ఒకేచోట రెండు అద్భుతాలు

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే టాలీవుడ్ చందమామ కాజల్‌కు ఇప్పుడు కాస్త సమయం దొరికింది. దీంతో తండ్రితో కలిసి అలా ఆగ్రాకు వెళ్లింది. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌ మహల్‌ను చూసింది. ప్రేమకు చిహ్నమైన తాజ్‌ను కాజల్ చూడటం ఇదే తొలిసారట. దీంతో తాజ్‌పై తన ప్రేమను వ్యక్తపరుస్తూ అభిమానుల కోసం కొన్ని ఫొటోలు షేర్ చేసింది కాజల్. ‘‘జీవితంలో తొలిసారి తాజ్‌ను చూశా.. దాని అందానికి మైమరిచిపోయా. నోట మాట రాలేదు. తాజ్ గొప్పతనం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 18, 2019 | 7:37 AM

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే టాలీవుడ్ చందమామ కాజల్‌కు ఇప్పుడు కాస్త సమయం దొరికింది. దీంతో తండ్రితో కలిసి అలా ఆగ్రాకు వెళ్లింది. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌ మహల్‌ను చూసింది. ప్రేమకు చిహ్నమైన తాజ్‌ను కాజల్ చూడటం ఇదే తొలిసారట. దీంతో తాజ్‌పై తన ప్రేమను వ్యక్తపరుస్తూ అభిమానుల కోసం కొన్ని ఫొటోలు షేర్ చేసింది కాజల్.

‘‘జీవితంలో తొలిసారి తాజ్‌ను చూశా.. దాని అందానికి మైమరిచిపోయా. నోట మాట రాలేదు. తాజ్ గొప్పతనం తెలుసుకొని ఆశ్చర్యపోయా. నా జీవితంలో చాలాసార్లు తాజ్ అందం గురించి విన్నా. కానీ తొలిసారి తాజ్‌లోని శిల్ప కళ, ధ్వని మిగిలిన విషయాలను స్వయంగా ఆస్వాదించా. నా మనసులో తాజ్‌కు చెరగని ముద్ర పడింది. వండర్ ఆఫ్ ది వరల్డ్’’ అంటూ ఓ ఫొటోకు కామెంట్ పెట్టింది. మరో ఫొటోకు ‘‘ప్రేమకు చిహ్నమైన తాజ్‌ నన్ను దీని గురించి మాట్లాడేలా చేస్తోంది. నా ఆలోచనలకు పంచుకునే అవకాశం వచ్చింది’’ అంటూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే కాజల్ పెట్టిన ఫొటోలపై ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. వావ్ ప్రపంచంలోని రెండు అద్భుతాలు ఒకే చోట ఉన్నాయంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఈ ఏడాది ‘సీత’, ‘రణరంగం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాజల్. అయితే ఈ రెండు చిత్రాలు ఆమెను నిరాశపరిచాయి. కానీ తమిళ్‌లో జయం రవి సరసన నటించిన ‘కోమలి’ చిత్ర విజయం ఆమెకు కాస్త బూస్టప్ ఇచ్చింది. ఇక ఆమె నటించిన ‘పారిస్ పారిస్’ విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘క్వీన్’ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అలాగే ప్రస్తుతం ‘కాల్ సెంటర్’, ‘ముంబయి సెగా’, ‘అ 2’, ‘భారతీయుడు 2’ చిత్రాల్లో నటిస్తుంది ఈ చందమామ.

https://www.instagram.com/p/B2gANT7H03U/

https://www.instagram.com/p/B2f-2N7nI36/

https://www.instagram.com/p/B2f-Y72HwN3/

https://www.instagram.com/p/B2gALCenbXx/

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu