Jhanvi Kapoor: ఆ ఫోటోల‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన జాన్వీ.. అవి ఇప్పుడు తీసినవి కావంటూ వాపోయిన చిన్న‌ది..

|

May 05, 2021 | 5:47 AM

Jhanvi Kapoor: సినిమా నేప‌థ్యం ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి జాన్వీ కపూర్‌. త‌లుచుకుంటే భారీ బ‌డ్జెట్ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉన్నా.. ధ‌డక్ వంటి చిన్న...

Jhanvi Kapoor: ఆ ఫోటోల‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన జాన్వీ.. అవి ఇప్పుడు తీసినవి కావంటూ వాపోయిన చిన్న‌ది..
Jhanvi Kapoor
Follow us on

Jhanvi Kapoor: సినిమా నేప‌థ్యం ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి జాన్వీ కపూర్‌. త‌లుచుకుంటే భారీ బ‌డ్జెట్ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉన్నా.. ధ‌డక్ వంటి చిన్న సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. ఈ సినిమాలో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల విష‌యంలో ఆచితూచి నిర్ణ‌యం తీసుకుంటూ న‌ట‌నకు ప్రాధాన్య ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ దూసుకెళుతోంది జాన్వీ. ఇక సినిమాల్లో గ్లామ‌ర్ డోస్‌ను కాస్త త‌క్కువ‌గా ఉండేలా చూసుకునే ఈ చిన్న‌ది సోష‌ల్ మీడియాలో మాత్రం కాస్త హాట్ హాట్‌గా క‌నిపిస్తుంది. ప‌లు ఫొటో షూట్ల‌కు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ సోష‌ల్ మీడియాను వేడెక్కిస్తుంది.
ఈ క్ర‌మంలోనే తాజాగా జాన్వీ క‌పూర్ ఓ మ్యాగ‌జైన్ కోసం దిగిన ఫొటోలోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బీచ్ ఒడ్డున దిగిన ఈ ఫొటోల్లో జాన్వీ కాస్త హాట్‌గా క‌నిపించింది. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు.. క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోన్న ఈ త‌రుణంలో ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయ‌డం అవ‌స‌ర‌మా.? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో ఈ విష‌యాన్ని గుర్తించిన జాన్వీ.. వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు తీసిన‌వి కావ‌ని గ‌తంలో ఎప్పుడో తీసిన ఫొటోలని, ఓ మ్యాగ‌జైన్ కోసం దిగిన ఫొటోషూట్ అంటూ చెప్పుకొచ్చింది. త‌న‌ను అపార్థం చేసుకున్నార‌ని వాపోయిందీ చిన్న‌ది. ఇక త‌న‌కూ సామాజిక బాధ్యత గురించి బాగా తెలుసని, కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..

Drishyam 2: హిందీలోనూ ‘దృశ్యం 2’.. రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..

రికార్డులల్లో తగ్గేదేలే అంటున్న ‘పుష్ప’.. అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్.. టాలీవుడ్ లోనే ఫస్ట్.!