రికార్డులల్లో తగ్గేదేలే అంటున్న ‘పుష్ప’.. అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్.. టాలీవుడ్ లోనే ఫస్ట్.!

Allu Arjun Pushpa Teaser: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. అయితే...

  • Ravi Kiran
  • Publish Date - 8:22 pm, Tue, 4 May 21
రికార్డులల్లో తగ్గేదేలే అంటున్న 'పుష్ప'.. అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్.. టాలీవుడ్ లోనే ఫస్ట్.!
Allu Arjuna Pushpa Raj

Allu Arjun Pushpa Teaser: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. అయితే రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్, యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. ఎస్‌ మొన్నా మధ్య టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 50ప్లస్‌ మిలియన్ వ్యూస్ సాదించిన.. ఈ టీజర్‌… ఇప్పుడు మరో రికార్డును సెట్‌ చేసింది. అవును.. టాలీవుడ్ లోనే 60+ మిలియన్ల వ్యూస్, 1.4+ మిలియన్ల లైక్స్ సాధించిన ఫస్ట్‌ అండ్‌ ఫాస్టెస్ట్ టీజర్ గా రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పుడిదే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ సినిమా పై అంచనాలని తారాస్థాయికి చేర్చాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు.

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!