Sudigaali Sudheer : సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం ఫొటోలు వైరల్.. ఎంగేజ్‌మెంట్ అయినా పెళ్లి ఎందుకు ఆగిపోయింది?

బుల్లితెరపై అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు వ్యాఖ్యతగా, హీరోగా అలరిస్తున్నాడు సుధీర్. అయిటే సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి నిత్యం ఏదోక న్యూస్ వైరలవుతుంది. తాజాగా అతడి ఎంగేజ్మెంట్ ఫోటోస్ అంటూ నెట్టింట కొన్ని పాత ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఆ చిత్రాల వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకుందామా.

Sudigaali Sudheer : సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం ఫొటోలు వైరల్.. ఎంగేజ్‌మెంట్ అయినా పెళ్లి ఎందుకు ఆగిపోయింది?
Sudigali Sudheer

Updated on: Oct 17, 2026 | 12:39 PM

బుల్లితెర ప్రపంచంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇఫ్పుడు హీరోగా, అటు వ్యాఖ్యతగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో, టీవీ రంగంలో ఎక్కడ చూసిన సుధీర్ పెళ్లి గురించి ఏదోక చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇదివరకు చాలా సందర్భాల్లో తన పెళ్లి, ప్రేమ గురించి సుధీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో సుధీర్ నిశ్చితార్థంకు సంబంధించిన కొన్ని పాత ఫోటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ వేడుకకు ధనరాజ్, రాకింగ్ రాకేష్ సహా ఇతర జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం హాజరయ్యారు. అయితే ఆ ఫోటోస్ చూస్తుంటే చాలా కాలం క్రితం పిక్స్ అని తెలుస్తోంది. గతంలో సుధీర్ కు ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందట. కానీ మధ్యలోనే వీరి పెళ్లి ఆగిపోయిందని సమాచారం. పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరి బంధం ముక్కలయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

అయితే ఈ ఫోటోస్ గురించి ఇంకా సుధీర్ రియాక్ట్ కాలేదు. కానీ గత కొన్ని గంటలుగా ఈ ఫోటోస్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంపై సుధీర్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే.. సుడిగాలి సుధీర్ తమ్ముడికి ఆల్రెడీ పెళ్లైపోయింది. గతంలో తాను ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్లిపోవడంతో సుధీర్ చాలా కాలం డిప్రెషన్ లో ఉన్నాడని.. ఆ తర్వాత కోలుకుని జబర్దస్త్ ద్వారా హాస్యనటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగాను అలరిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

ప్రస్తుతం సుధీర్ బుల్లితెరపై యాంకర్ గా అలరిస్తూనే మరోవైపు హీరోగాను మెప్పిస్తున్నాడు. అతడు నటిస్తోన్న మూవీ గోట్. ‘పాగల్’ సినిమా ఫేమ్ నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో ‘బ్యాచిలర్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యభారతి ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా షూటింగ్ 2023 లోనే ప్రారంభమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తొలుత ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో వాయిదా పడింది. తాజా అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Loading...
Unable to load recommendations.
Follow Us