రోజా ‘జబర్దస్త్’కు టాటా..? అసలు కారణం ఇదే!

నటిగా, పొలిటీషన్‌గా, జడ్జీగా, యాంకర్‌గా తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌తో ఉంటుంది రోజా. అయితే ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అన్నట్లుగా మారింది రోజాకి. ప్రస్తుతం రోజాకు వైసీపీ పార్టీలో కొన్ని కీలక బాధ్యతలను అప్పగించారు. వైసీపీలోని సీనియర్ నేతల్లో రోజా ఒకరు. ఆమె రెండవసారి వరుసగా గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రోజాను ఏపీ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఏపీ సీఎం జగన్ నియమించారు. దీనితో ఇప్పుడు పార్టీలో రోజా రోల్ ఎక్కువైంది. మరి […]

  • Ravi Kiran
  • Publish Date - 7:48 am, Tue, 13 August 19
రోజా 'జబర్దస్త్'కు టాటా..? అసలు కారణం ఇదే!

నటిగా, పొలిటీషన్‌గా, జడ్జీగా, యాంకర్‌గా తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌తో ఉంటుంది రోజా. అయితే ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అన్నట్లుగా మారింది రోజాకి. ప్రస్తుతం రోజాకు వైసీపీ పార్టీలో కొన్ని కీలక బాధ్యతలను అప్పగించారు. వైసీపీలోని సీనియర్ నేతల్లో రోజా ఒకరు. ఆమె రెండవసారి వరుసగా గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రోజాను ఏపీ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఏపీ సీఎం జగన్ నియమించారు. దీనితో ఇప్పుడు పార్టీలో రోజా రోల్ ఎక్కువైంది. మరి ఇలాంటి టైంలో రోజా జబర్దస్త్‌కి టైం ఇవ్వగలుగుతుందా అని అందరిలోనూ ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇన్ని రోజులు ఎలాగున్నా, ఇప్పుడు రోజా జబర్దస్త్‌లో ఉంటే, టీడీపీతో సహా విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. దానితో రోజా జబర్దస్త్కి గుడ్‌బై చెబుతారన్న టాక్ జోరుగా నడుస్తోంది. ఇదే సమయంలో రోజాకు మూవీ ఆఫర్ రావడం, దాని కోసం కాల్షీట్లు కేటాయించడం కోసం జబర్దస్త్‌కి టైం ఇవ్వలేకపోవచ్చని అంటున్నారు. మొత్తంగా ఎలా చూసుకున్న రోజాకు జబర్దస్త్‌కి మధ్య గ్యాప్ వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ గ్యాపే ఎక్కువై మొత్తానికే రోజా జబర్దస్త్‌కి కొన్ని రోజుల్లోనే తప్పుకుంటారని అంటున్నారు. అదే జరిగితే జబర్దస్త్‌లో రోజా లేని లోటు ఎవరు తీర్చలేరు అని అంటున్నారు. నాగబాబు నవ్వు, రోజా టైమింగ్ పంచ్ జబర్దస్త్‌కి చాలా ప్లస్ అయ్యింది. చూడాలి మరి రోజా ఏ నిర్ణయం తీసుకుంటారో.