బేర్‌గ్రిల్స్‌తో ‘కిలాడీ’ సాహసయాత్ర

సాహసాలు చేయడంలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌గ్రిల్స్‌తో కలిసి ఆయన అడవిలో సాహసాలు చేశారు.

బేర్‌గ్రిల్స్‌తో కిలాడీ సాహసయాత్ర

Updated on: Aug 22, 2020 | 8:03 AM

Akshay Kumar With Bear Grylls: సాహసాలు చేయడంలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌గ్రిల్స్‌తో కలిసి ఆయన అడవిలో సాహసాలు చేశారు. దీనికి సంబంధించిన ప్రొమో ఇటీవల విడుదల కాగా.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆ ప్రోమోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన అక్షయ్‌… ”నన్నో పిచ్చోడిని అనుకుంటున్నారా.. అయితే పిచ్చోళ్లే ఇలా అడవుల్లోకి వెళతారు” అంటూ కామెంట్ పెట్టారు. మరోవైపు బేర్‌ కూడా దీనికి సంబంధించిన మోషన్ పోస్ట్‌ర్‌ని తన అకౌంట్‌లో షేర్ చేస్తూ.. ”జీవితమంటే ఓ సాహసయాత్ర. వాటిని ఎంజాయ్ చేసే వారు కొందరే ఉంటారు. లెజండరీ అక్షయ్ కుమార్ ఓ ఉత్తమ సాహస యాత్రికుడు” అంటూ కొనియాడారు. కాగా అక్షయ్‌, బేర్‌గ్రిల్స్‌ కలిసి చేసిన సాహసయాత్ర ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 11న డిస్కవరీ ప్లస్ యాప్‌లో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే బేర్‌ గ్రిల్స్‌తో గతంలో ప్రధాని మోదీ, సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సాహసయాత్రలు చేసిన విషయం తెలిసిందే. వారి తరువాత మూడో వ్యక్తిగా అక్షయ్ నిలిచారు.

Read More:

తేమ నియంత్రణతో కరోనా వ్యాప్తి కట్టడి

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ బీజేపీ

 

Loading...
Unable to load recommendations.
Follow Us