The Matrix Resurrections: ఓటీటీలో ప్రియాంక హాలీవుడ్ మూవీ.. మ్యాట్రిక్స్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

| Edited By: Ravi Kiran

Apr 26, 2022 | 12:25 PM

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ది మ్యాట్రిక్స్‌కు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. 1999లో ది మ్యాట్రిక్స్‌ విడుదల కాగా..

The Matrix Resurrections: ఓటీటీలో ప్రియాంక హాలీవుడ్ మూవీ.. మ్యాట్రిక్స్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Matrix Resurrections
Follow us on

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ది మ్యాట్రిక్స్‌కు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. 1999లో ది మ్యాట్రిక్స్‌ విడుదల కాగా దీనికి కొనసాగింపుగా వచ్చిన ది మ్యాట్రిక్స్‌: రీలోడెడ్‌ (2003), ది మ్యాట్రిక్స్‌: రివల్యూషన్స్‌'(2003) చిత్రాలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ స్కైఫై యాక్షన్‌ సిరీస్‌లో వచ్చిన నాలుగో చిత్రం ది మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌ (The Matrix Resurrections). ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించడం విశేషం. కాగా గతేడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ర్కీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్‌.

తెలుగులో కూడా..
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మే 6 నుంచి ఈ సినిమా ఇండియాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ యాక్షన్‌ మూవీ ప్రసారం అవ్వనుంది. లానా వాచోస్కీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్‌ కీను రీవ్స్‌, క్యారీ-అన్నే, జడా పింకెట్‌ స్మిత్‌, యహ్యా అబ్దుల్‌ మాటీన్‌, జోనాథన్‌ గ్రోఫ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఆస్వాదించండి.

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also read: 

Pawan Kalyan : స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. శరవేగంగా హరిహర వీరమల్లు షూటింగ్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో..

Avika Gor: ఎర్రటి గులాబీ అందాలతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న అవికా.. ఇంత అందానికి ఫిదా కాని వారుంటారా

Health Tips: ఈ బ్లడ్ గ్రూపుల వారికే గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ.. కారణం ఏంటో తెలుసా?