Hollywood: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు కన్నుమూత.. గౌరవార్ధం నవ్వమని కోరిన కుటుంబ సభ్యులు

|

Apr 13, 2022 | 6:32 PM

Hollywood: చిత్ర ప‌రిశ్రమ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్‌ హాస్యనటుడు, “ అల్లాదీన్ ” (Aladdin) స్టార్  గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్ (Gilbert Gottfried) కన్నుమూశారు. ఆయన వయసు 67. సుదీర్ఘ కాలంగా..

Hollywood: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు కన్నుమూత.. గౌరవార్ధం నవ్వమని కోరిన కుటుంబ సభ్యులు
Gilbert Gottfried Passed Aw
Follow us on

Hollywood: చిత్ర ప‌రిశ్రమ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్‌ హాస్యనటుడు, “ అల్లాదీన్ ” (Aladdin) స్టార్  గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్ (Gilbert Gottfried) కన్నుమూశారు. ఆయన వయసు 67. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో పోరాడుతూ గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్  మరణించినట్లు అతని కుటుంబం మంగళవారం ప్రకటించింది. గిల్బర్ట్ మయోటోనిక్ డిస్ట్రోఫీ టైప్ 2 అనే అరుదైన కండరాల బలహీనతతో బాధపడుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాదు గిల్బర్ట్ మరణం మనకు ఎంత బాధను కలిగించినా.. అతని గౌరవార్థం “నవ్వుతూ ఉండండి” అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గిల్బర్ట్ ది కామెడీలో నిజమైన దిగ్గజ వాయిస్‌. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా అతను ఓ అద్భుతమైన భర్త, సోదరుడు, స్నేహితుడు. ఇద్దరు చిన్నపిల్లలకు తండ్రి. అయినప్పటికీ ఈరోజు మనలని అందరినీ విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు.. ఇది మనందరికీ విచారకరమైన వార్త.. అయినప్పటికీ, దయచేసి గిల్బర్ట్ గౌరవార్థం వీలైనంత బిగ్గరగా నవ్వుతూ ఉండండి. ఇట్లు గాట్‌ఫ్రైడ్ కుటుంబం” అంటూ అతని కుటుంబం ట్విట్టర్‌లో ఓ ట్విట్ చేసింది.

గిల్బర్ట్ మృతి పట్ల హాలీవుడ్‌లోని హాస్యనటులు జాసన్ అలెగ్జాండర్, డేన్ కుక్  సహా అనేక మంది సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. గిల్బర్ట్  ఒక అందమైన వ్యక్తి, ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండేవాడు. తాను ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండేలా చేసేవాడు అంటూ అతనితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఫిబ్రవరి 28, 1955లో బ్రూక్లిన్‌లో జన్మించిన గాట్‌ఫ్రెడ్‌ న్యూయార్క్‌లో పెరిగారు. కేవలం 15 సంవత్సరాల వయస్సులో స్టాండ్-అప్ కామెడీని ప్రదర్శించడం ప్రారంభించాడు. అంతేకాదు ఏ విషమైన అంశాన్ని అయినా తనదైన శైలి కామెడీ చేయగల సత్తా.. ఆయన సొంతం.. అందుకే అతడిని.. అతని వాయిస్ ను హాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలబెట్టింది.యానిమేటెడ్‌ ఫిలిం అల్లా ఉద్దీన్‌లో చిలుక పాత్రకు గిల్బర్ట్అందించిన వాయిస్.. అత‌డికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. ఇక 2001లో న్యూయార్క్‌, వాషింగ్టన్‌ నగరాల్లో జరిగిన జంట దాడులు సుమారు 3 వేల మంది .. మరణిస్తే.. ఈ ఘటనను కూడా ఎవరూ కోపం తెచ్చుకొని విధంగా చమత్కారంగా చెప్పడం ఒక్క గిల్బర్ట్ కె చెల్లింది. అందుకే అతడిని హాలీవుడ్ లో దిగ్గజ హాస్య నటుడిని చేసింది.

Also Read: Sucharitha Meets Jagan: అలక వీడిన మాజీ హోంమంత్రి.. ఏ లేఖ రాసినా రాజీనామానే అవుతుందా?: సుచరిత