కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలకు ఇండియన్ సెలబ్రెటీస్ హాజరయ్యారు.. ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ అందాల తారా ఐశ్వర్య రాయ్ .. ప్రిన్సెస్ లా మెరిసింది.
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్..కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు హాజరయ్యారు..ఈ వేడుకలలో మూడో రోజు ఐశ్వర్య రాయ్ ఎంట్రీ ఇచ్చింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మొదటి రెండు రోజులు మరింత అందంగా కనిపించిన ఐశ్వర్య..మూడవ రోజు ప్రిన్సెస్ ను తలపించింది. ఆమె స్కాల్ప్ గౌన్ తో కూడిన దుస్తులను ధరించింది. దానిని గౌరవ్ గుప్తా డిజైన్ చేశారు.
దుస్తులు మాత్రమే కాదు.. ఆమె ఐ మేకప్ కూడా గ్లామరస్ లుక్కును మరింత పెంచింది.
ఆమె స్టైలిష్ గౌనులో మినిమల్ జ్యూవేల్లరి వేసింది. అందులో మరింత స్టైలిష్ గా కనిపించింది. ఆమె లుక్స్ అక్కడున్న వారిని మంత్రముగ్దులను చేసింది.